ఫోటోటాక్ : రెడ్ డ్రెస్‌లో మెరిసి పోతున్న మీనూ
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
By: Tupaki Desk | 22 May 2025 6:00 AM IST'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. టాలీవుడ్‌లో మొదటి సినిమాతో బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా లక్కీగా మరిన్ని ఆఫర్లు దక్కాయి. రవితేజ ఖిలాడీ సినిమాలో నటించడంతో మరో అవకాశంను సొంతం చేసుకుంది. రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దాంతో మీనాక్షి చౌదరికి మరోసారి నిరాశ మిగిలింది. హిట్ 2 సినిమాలో హీరోయిన్‌గా నటించి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. సక్సెస్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటున్న మీనాక్షి చౌదరికి 2024లో ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ ఏడాది ఆరంభంలోనే వెంకటేష్‌తో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో తెల్సిందే. అందులో పోలీస్ ఆఫీసర్‌గా నటించడంతో పాటు, కామెడీ యాంగిల్‌ను కూడా చూపించింది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ నేపథ్యంలో మీనాక్షి చౌదరి సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతోంది. మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె హీరోయిన్‌గా సినిమాల్లో కనిపించడం కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా నాగ చైతన్యతో కలిసి ఒక సినిమాను ఈ అమ్మడు చేస్తుంది. సినిమాల షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నా ఇలాంటి ఫోటో షూట్స్‌ను రెగ్యులర్‌గా ముద్దుగుమ్మ షేర్ చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి రెడ్ డ్రెస్‌లో అందమైన తన ఫోటోలను షేర్ చేసింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత మీనాక్షి చౌదరికే చెల్లింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ డ్రెస్‌లో కవ్వించే చూపులతో మీనాక్షి ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి ఎలాంటి ఔట్ ఫిట్‌లో అయినా భలే అందంగా ఉంటుంది అంటూ మరోసారి ఈ ఫోటోలను చూస్తే అనిపిస్తుంది అంటూ అభిమానులు, సోషల్ మీడియా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో ముఖ్య పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి మట్కా, మెకానిక్ రాకీ సినిమాల్లోనూ నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. విభిన్నమైన పాత్రల్లో నటించడం ద్వారా ప్రతి సినిమాతో భిన్నంగా కనిపిస్తూ వస్తున్న మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల్లోనూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతుంది. హిందీ సినిమాల్లోనూ ఈమెకు ఆఫర్లు వస్తున్నాయట, కానీ ప్రస్తుతానికి తెలుగు సినిమాల్లోనే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో నో చెబుతుందట. కోలీవుడ్‌లోనూ నటించేందుకు ఈమె ఆసక్తిగా ఉంది. త్వరలోనే తమిళ్ స్టార్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
