Begin typing your search above and press return to search.

మీనాక్షి ఆ కోలీవుడ్ సినిమాకు ఓకే అనిందా?

గ‌తేడాది మీనాక్షి అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించింది. వాటిలో అన్నీ సినిమాలూ హిట్లు కాక‌పోయిన‌ప్ప‌టికీ మీనాక్షి మాత్రం త‌న క్రేజ్ ను, ఫాలోయింగ్ ను పెంచుకుంటూనే వెళ్తుంది.

By:  Tupaki Desk   |   24 May 2025 6:32 AM
మీనాక్షి ఆ కోలీవుడ్ సినిమాకు ఓకే అనిందా?
X

ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హ‌ర్యానా భామ మీనాక్షి చౌద‌రికి ఆ సినిమా ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ త‌ర్వాత ఛాన్సులు మాత్రం బాగానే వ‌చ్చాయి. ఛాన్సులైతే వ‌చ్చాయి కానీ మీనాక్షి హిట్ అందుకోవ‌డానికి కాస్త టైమ్ ప‌ట్టింది. అలా మెల్లిగా టాలీవుడ్ లో నిల‌దొక్కుకున్న మీనాక్షి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది.

గ‌తేడాది మీనాక్షి అర‌డ‌జ‌ను సినిమాల్లో న‌టించింది. వాటిలో అన్నీ సినిమాలూ హిట్లు కాక‌పోయిన‌ప్ప‌టికీ మీనాక్షి మాత్రం త‌న క్రేజ్ ను, ఫాలోయింగ్ ను పెంచుకుంటూనే వెళ్తుంది. గ‌తేడాది దుల్కర్ సల్మాన్ తో క‌లిసి ల‌క్కీ భాస్క‌ర్ తో సూప‌ర్ హిట్ ను అందుకున్న మీనాక్షి ఈ ఇయ‌ర్ వెంక‌టేష్ తో క‌లిసి సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఖాతాలో వేసుకుంది.

ప్ర‌స్తుతం మీనాక్షి చేతిలో ప‌లు ప్రాజెక్టులుండ‌గా, అందులో రెండు తెలుగు సినిమాలున్నాయి. నాగ చైత‌న్య హీరోగా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మిస్టిక్ థ్రిల్ల‌ర్ NC24 లో హీరోయిన్ గా న‌టిస్తున్న మీనాక్షి దాంతో పాటూ న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టిస్తున్న అన‌గ‌న‌గా ఒక రాజు అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ లో కూడా న‌టిస్తోంది.

అయితే ఓ త‌మిళ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా న‌టించ‌నుంద‌నే విష‌యంలో మొన్న‌టివ‌ర‌కు వార్త‌ల్లో నిలిచింది మీనాక్షి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడా సినిమాకు మీనాక్షి సైన్ చేసింద‌ని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ చేయ‌బోయే 63వ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. విక్ర‌మ్63 గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మ‌రికొన్ని వారాల్లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌డోన్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు.