Begin typing your search above and press return to search.

నా ఎత్తుతో సమస్య... చాలా బాధ వేసేది : మీనాక్షి చౌదరి

ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ఆరంభం గురించి, తన బాల్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   27 April 2025 5:00 PM IST
నా ఎత్తుతో సమస్య... చాలా బాధ వేసేది : మీనాక్షి చౌదరి
X

గత ఏడాది 'లక్కీ భాస్కర్‌', ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. తెలుగులో మొదటి సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' నిరాశపరచడంతో ముందు ముందు ఆఫర్లు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ లక్కీగా ఈ అమ్మడికి ఆ సినిమా కారణంగా ఖిలాడీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత హిట్‌ 2, గుంటూరు కారం సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. గత ఏడాదిలో చాలా సినిమాలు చేసిన ఈ అమ్మడు లక్కీ భాస్కర్‌తో మాత్రమే హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ఆరంభం గురించి, తన బాల్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ... చిన్నతనంలో ఇతరులతో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేదాన్ని. కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. దాంతో చాలా మంది అమ్మాయిలతో పోల్చితే నేను చాలా ఎత్తుగా ఉండేదాన్ని. దాంతో అంతా నాకు దూరంగా ఉండేవారు, నా ఎత్తు నాకు పెద్ద సమస్యగా అనిపించింది. ఆ సమయంలో చాలా బాధ వేసింది. ఆర్మీ ఆఫీసర్‌ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్యను నువ్వే పరిస్కరించుకోవాలని సూచించాడు. దాంతో నేను బుక్స్‌ను స్నేహితులుగా చూడటం చేశాను. ఎక్కువ బుక్స్ చదవడంతో పాటు, అందాల పోటీల్లో పాల్గొనేందుకు, ఆటలపై ఆసక్తి కలిగింది.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో నిరాశే మిగిలింది. అయితే వచ్చిన ప్రతి ఆఫర్‌ కూడా నేను సాధ్యం అయినంత వరకు కష్టపడి సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కారణంగానే నాకు ఖిలాడీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. కనుక ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆఫర్‌ కూడా కచ్చితంగా ముందు ముందు కెరీర్‌ నిలదొక్కుకునేందుకు సహయపడుతుందని భావిస్తున్నాను. సీనియర్‌ హీరోలతో నటించడం ఏంటి అంటూ చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి హీరోతో అయినా నటించేందుకు నాకు ఇబ్బంది లేదు. సీనియర్‌ హీరోలతో నటించడం అనేది ఒక జోనర్‌ సినిమాగా భావిస్తాను.

వెంకటేష్‌ గారితో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించడం అనేది చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. ఆయనతో వర్క్ చేయడంను ఎంజాయ్‌ చేశాను. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా విశ్వంభరలోనూ నటిస్తున్నాను. ఆ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా, గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి. కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి తప్ప అతి విశ్వాసం, అతి నమ్మకంతో సినిమాలను వదులుకోవద్దని మీనాక్షి సూచించింది. పుకార్లు అనేవి చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. అయినా కూడా రూమర్స్ చూసినప్పుడు కోపం వస్తుంది. నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను. కనుక నన్ను సోషల్‌ మీడియా ద్వారా సంప్రదించి క్లారిటీ తీసుకోవాలని మీనాక్షి కోరింది. నా గురించి ఏ విషయం అయినా సోషల్‌ మీడియా ద్వారా నేను చెప్తాను. కనుక పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.