పిక్‌టాక్ : మీనాక్షి మేడం ఏంటి ఇలా తయారైంది?
ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి కెరీర్‌లో దూసుకు పోతుంది.
By: Tupaki Desk | 14 Jun 2025 11:44 AM ISTఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ దక్కించుకున్న మీనాక్షి చౌదరి కెరీర్‌లో దూసుకు పోతుంది. గత ఏడాది ఈమె నుంచి పలు సినిమాలు వచ్చాయి. వాటిల్లో లక్కీ భాస్కర్ మినహా మరే సినిమాలు అంతగా ఆడలేదు. అందుకే ఈసారి కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈమె చేస్తున్న సినిమాలను చూస్తే పక్కా హిట్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ యాంగిల్‌ను చూపించిన మీనాక్షి చౌదరి ముందు ముందు మరిన్ని గ్లామర్ షో పాత్రలను చేయడంతో పాటు, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు నాగ చైతన్యకు జోడీగా ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక నవీన్ పొలిశెట్టి మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్ అనగనగ ఒక రాజు సినిమా సైతం ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలోనూ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ ఏడాది మరో రెండు సినిమాలకు కమిట్ కావాలని ఈ అమ్మడు భావిస్తుంది. కానీ రెండు సినిమాలు మాత్రమే ఈ ఏడాదిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాల సంఖ్య పెంచకుండా ఎక్కువ హిట్స్ కొట్టాలని ఈమె కోరుకుంటుంది.
మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా యాక్టివ్‌గా ఉంటుంది. గత ఏడాది నుంచి ఈమె ఫాలోవర్స్ సంఖ్య అత్యధికంగా పెరుగుతూ వస్తుంది. ఇన్‌స్టాలో దాదాపుగా మూడు మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మీనాక్షి చౌదరి వరుసగా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా స్టిఫ్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఇప్పుడు చాలా సన్నగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో మీనాక్షి చౌదరి కొంత బరువు తగ్గి ఉంటుందా అనే చర్చకు ఈ ఫోటోలు తెర తీశాయి.
కెరీర్ ఆరంభంలో సన్నగా కనిపించిన మీనాక్షి చౌదరి మధ్యలో కాస్త బరువు పెరిగింది. ఇప్పుడు తిరిగి బరువు తగ్గింది. ముఖ్యంగా ఈమె ఈ ఔట్ ఫిట్‌లో సన్నని నడుముతో కనిపించడంతో అంతా కూడా వావ్ అంటున్నారు. ఈ విభిన్నమైన ఔట్ ఫిట్ కారణంగా మీనాక్షి మరింత అందంగా కనిపించడంతో పాటు, నెటిజన్స్ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందు ముందు ఇలాగే మీనాక్షి చౌదరి ఫిజిక్‌ను మెయింటెన్ చేస్తే యంగ్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
