Begin typing your search above and press return to search.

డెనిమ్స్‌లో మీనాక్షి సోయ‌గాలు

ఇప్పుడు మీనాక్షి బ్లూ డెనిమ్స్ లో గుబులు రేపే ఫోజుల‌తో చెల‌రేగిపోయింది. ప్రస్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నీకుండా చేస్తోంది.

By:  Tupaki Desk   |   11 July 2025 7:00 AM IST
డెనిమ్స్‌లో మీనాక్షి సోయ‌గాలు
X

అందంతో క‌వ్విస్తుంది.. ఫ్యాష‌న్ సెన్స్‌తో మురిపిస్తుంది. కాంపిటీష‌న్ ఎంత ఉన్నా, త‌న‌నే ప్ర‌జ‌ల క‌ళ్లు వెంబ‌డించే సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా నిలుస్తుంది. ఈ భామ‌లో మ‌ల్టీ ట్యాలెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇంత‌కీ ఎవ‌రీ ముద్దుగుమ్మ? అంటే.. నిస్కంకోచంగా మీనాక్షి చౌద‌రి గురించే ఇదంతా.

ఇప్పుడు మీనాక్షి బ్లూ డెనిమ్స్ లో గుబులు రేపే ఫోజుల‌తో చెల‌రేగిపోయింది. ప్రస్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోషూట్ కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నీకుండా చేస్తోంది. మీనాక్షి బ్లూ అండ్ బ్లూ డెనిమ్ లుక్ లో ఎంతో సూప‌ర్భ్ గా క‌నిపిస్తోందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. మీనాక్షి త‌న చేతికి బ‌రువైన గాజులు, చెవికి కాంబినేష‌న్ జూకాల్ని ధ‌రించి సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది.

వెంకీతో `సంక్రాంతికి వస్తున్నాం`, మ‌హేష్‌తో `గుంటూరు కారం` లాంటి భారీ చిత్రాల్లో న‌టించిన మీనాక్షి చౌద‌రి, టాలీవుడ్ కోలీవుడ్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల్లో న‌టించింది. హిట్ ది సెకండ్ కేస్, గోట్, ల‌క్కీ భాస్క‌ర్ లాంటి క్రేజీ చిత్రాల్లోను మీనాక్షి న‌టించింది. ఈ భామ నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే అన‌గ‌న‌గా ఒక రోజు అనే చిత్రంలోను న‌టిస్తోంది. ఈ రోజుల్లో ఇండ‌స్ట్రీలో నెగ్గుకు రావాలంటే, యూనిక్ నెస్ తో దూసుకురావాల‌ని చెప్పే మీనాక్షి త‌న‌దైన యూనిక్ నెస్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.