లెజెండరీ నటి పాత్రకు కియారా న్యాయం చేయగలదా?
నటిగా 90 చిత్రాలకు పైగా చేసింది. కమల్ ఆమ్రోహీ కుటుంబం ఇప్పుడామె బయోపిక్ తో ఘనమైన నివాళి అర్పించాలని చూస్తోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 8:00 AM ISTబాలీవుడ్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి వృత్తి, వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటింది. నటిగా ఎన్నో క్లాసిక్ హిట్స్ తో తనకంటూ బాలీవుడ్ చరిత్రలో కొన్ని పేజీలు రాసిపెట్టింది. 'సాహిబ్ బివి ఔర్ గులాం', 'దిల్ ఏక్ మందిర్', 'ఫూల్ ఔర్ పత్తర్', 'పకీజా' లాంటి చిత్రాలో అప్పట్లో మీనా కుమారి ఓ సంచలనం. సినిమాలు చేస్తున్నంత కాలం మీనా కుమారి బాలీవుడ్ లో ఓ మెరుపు. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం ఎంతో విషాధకరమైంది.
ప్రేమ, నిరాశ, మద్యపానం అనే అంశాలు మీనా కుమారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసాయి. వృత్తి గత జీవితంలో ఎంత గొప్ప సక్సెస్ సాధించిందో వ్యక్తిగత జీవితంలో అంతకంతకు కోల్పోయింది. తెరపై ప్రతి పాత్రలోనూ తన ఆత్మను, మనసును అంకితం చేసింది మీనా కుమారి. కానీ జీవితాంతం ప్రేమ కోసమే పోరాడింది. తనకంటే 37 సంవత్సరాలు పెద్దవాడైన చిత్రనిర్మాత కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది.
కానీ అప్పటికే అతడికి పెళ్లైపోయింది. ఈ పెళ్లితో ఆమె జీవితాన్నే కోల్పోయింది. జీవితంలో దుఃఖం, వేదన తప్ప మరేమి దక్కలేదు. పకీజా సినిమాకు దర్శకత్వం వహిం చింది కమల్ ఆమ్రోహీ. పకీజా రిలీజ్ కు 15 ఏళ్లు పట్టడానికి కారణం కూడా వారిమధ్య సంబధం దెబ్బతి నమేనని నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు విడాకులతో వేరయ్యారు. అటుపై మద్యానికి బానిసై ఆరోగ్యం క్షిణించి సినిమా విడుదలైన రెండు నెలలకు 37 ఏళ్ల వయసులోనూ కన్ను మూసింది.
నటిగా 90 చిత్రాలకు పైగా చేసింది. కమల్ ఆమ్రోహీ కుటుంబం ఇప్పుడామె బయోపిక్ తో ఘనమైన నివాళి అర్పించాలని చూస్తోంది. ఇప్పటికే మీనా కుమారి పాత్రకోసం కియారా అద్వారిని ఎంపిక చేసినట్లు వార్త లొస్తున్నాయి. మీనా పాత్రకు కియారా అన్ని రకాలుగా సరిపోతుంది అన్న భావన వ్యక్తమవుతోంది. మరి ఆమె ఎంట్రీ వాస్తవం ఎంతో తెలియాలి. ఈ బయోపిక్ లో నటిస్తే గనుక కియారా అద్వాణీ ఇమేజ్ మారి పోతుంది. నటిగా సరికొత్త ప్రయాణానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ పాత్రకు కియారా సరిపోతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎంపిక కరెక్ట్ కాదనే వాదనా తె రపైకి వస్తోంది.
