Begin typing your search above and press return to search.

హీరోయిన్ మీనా కూతుర్ని చూశారా?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారానే తమ వారసులను పరిచయం చేస్తూ.. వారికంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2025 12:21 PM IST
హీరోయిన్ మీనా కూతుర్ని చూశారా?
X

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారానే తమ వారసులను పరిచయం చేస్తూ.. వారికంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులు గానే ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతున్నారు. అలాంటి సెలబ్రిటీల పిల్లలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. సడన్గా ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ పెద్దయ్యాక వారు మళ్లీ మీడియా ముందుకు వస్తే వారిని చూసి ఆశ్చర్యం పడడం మన వంతు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మీనా రీఎంట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

ఇక భర్త విద్యాసాగర్ మరణం తర్వాత ఆ కూతురుతోనే కలిసి ఉంటున్న ఈమె తన కూతురి ఫోటోలను ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో షేర్ చేయలేదు. కానీ సడన్గా మీనా తన కూతురితో కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో మీనా కూతుర్ని చూసి అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్ లో ఉన్న ఈ అమ్మాయిని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన ఆ చిన్నారా ఈ అమ్మాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే క్రిస్మస్ సందర్భంగా సీనియర్ నటి మీనాతో కలిసి దిగిన ఫోటోలను నైనిక కలిసి ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ ఫోటో చూసి అభిమానులు త్వరలోనే నైనిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. తల్లికి మించిన అందంతో ఉన్న ఈ అమ్మాయి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే నైనిక ఐదు సంవత్సరాల వయసులోనే హీరో విజయ్ దళపతి నటించిన తేరి సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ సినిమా తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన ఈమె చదువుపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం ఈమె వయసు 14 సంవత్సరాలు. తాజా ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు మాత్రం ఇండస్ట్రీలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

మీనా విషయానికి వస్తే.. 1982లో నెంజంగల్ అనే సినిమా ద్వారా బాలనటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. ముఖ్యంగా శివాజీ గణేషన్ చిత్రాలలో ఎక్కువగా నటించిన ఈమె బాలనటిగా 45 కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 1990లో రాజేంద్రప్రసాద్ తో పాటు తెలుగులో నవయుగం అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం తమిళంలో హీరోయిన్గా అడుగు పెట్టింది. ఇకపోతే తెలుగులో చంటి , అల్లరి పిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఇలా ఎన్నో చిత్రాలలో నటించింది మీనా. ముఖ్యంగా వెంకటేష్ తో ఎక్కువ సినిమాలు చేసి బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడిగా పేరు దక్కించుకున్నారు. రీఎంట్రీలో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది మీనా. ఇక తన తదనంతరం తన కూతుర్ని కూడా ఇండస్ట్రీకి మళ్లీ తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్నారు.