ఇండియన్ బెస్ట్ ఓటీటీ లిస్ట్ లో మయసభ!
ఏకంగా 2.8 మిలియన్ల వ్యూస్ తో మయసభ మూడో ప్లేస్ లో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో వెడ్‌నెస్ డే సీజన్2(నెట్‌ఫ్లిక్స్), సలాకార్ (జియో హాట్‌స్టార్)లు ఉన్నాయి.
By: Tupaki Desk | 20 Aug 2025 12:03 AM ISTగతవారం అంటే ఆగస్ట్ 11 నుంచి 17 వరకు ఎక్కువ మంది చూసిన వెబ్‌సిరీస్ లిస్ట్ ను ఆర్మాక్స్ మీడియా వెల్లడించగా అందులో తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ గా రిలీజైన మయసభ మూడో స్థానాన్ని దక్కించుకుంది. మయసభ వెబ్‌సిరీస్ ఆగస్ట్ 7న సోనీ లివ్ లో ప్రీమియర్ కాగా, రిలీజైనప్పటి నుంచే ఈ సిరీస్ కు ఆడియన్స్ తో పాటూ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి.
సోనీలివ్ ఖాతాలో మరో సూపర్ హిట్
ఏకంగా 2.8 మిలియన్ల వ్యూస్ తో మయసభ మూడో ప్లేస్ లో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో వెడ్‌నెస్ డే సీజన్2(నెట్‌ఫ్లిక్స్), సలాకార్ (జియో హాట్‌స్టార్)లు ఉన్నాయి. స్కామ్ 1992, రాకెట్స్ బాయ్స్, ఫ్రాడమ్ ఎట్ మిడ్‌నైట్, ది హంట్: రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్ లాంటి వాటి తర్వాత సోనీ లివ్ కు మయసభ మరో సూపర్ హిట్ ను అందించింది.
మయసభలోని గ్రిప్పింగ్ కథ, ఆసక్తికర పాత్రలు, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆ సిరీస్ ను ఇండియన్ స్ట్రీమింగ్ రంగంలో సక్సెస్ గా నిలిపడంతో పాటూ అన్ని ప్రాంతాల ప్రేక్షకులను అలరించేలా చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాకర్ల కృష్ణమ నాయుడు, ఎంస్ రామి రెడ్డి అనే ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య స్నేహాన్ని, వారి పొలిటికల్ గ్రోత్ ను ఈ సిరీస్ లో చాలా బాగా చూపించారు.
ఈ సిరీస్ ఫిక్షనల్ స్టోరీ అని చెప్తున్నప్పటికీ సిరీస్ లోని పాత్రలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలను పోలి ఉన్నాయని అందరూ అంటున్నారు. మొత్తానికి దేవా కట్టా మరియు కిరణ్ జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొదటి సీజన్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ ను అందుకోవడమే కాకుండా సెకండ్ సీజన్ పై అంచనాలను పెంచింది.
