క్రియేటివిటీ వెనక రియాల్టీ గోస.. దేవా కట్టా ఆన్సర్ ఇది..!
టాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్ట లేటెస్ట్ గా మయసభ అంటూ ఒక సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు ఆయన.
By: Tupaki Desk | 19 July 2025 7:48 PM ISTటాలెంటెడ్ డైరెక్టర్ దేవా కట్ట లేటెస్ట్ గా మయసభ అంటూ ఒక సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు ఆయన. సినిమా కథ తెలుగు వాళ్లకు బాగా తెలిసిన రాజకీయ నాయకుల చుట్టూ రాసుకున్నట్టుగా ఉంది. ఏపీ చరిత్రని మలుపు తిప్పిన రాజకీయ పరిణామాలు ఇందులో ప్రస్తావించారు దేవా కట్ట. ఆగష్టు 7న సోనీ లివ్ లో తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఐతే ఈ సినిమా టీజర్ చూసిన ఒక నెటిజెన్ దేవా కట్టాని ఒక ప్రశ్న అడిగాడు.. దేవా కట్టా గారు.. ఇది క్రియేటివిటీ అని మీరు చెప్పినా ప్రజలు మాత్రం దీని వెనుక రియాల్టీ గోస ఉందని అంటున్నారని అడిగాడు. దీన్ని మీరు ఎలా సమర్ధించుకుంటారో అని అనగా.. దానికి దేవా కట్ట కూడా స్పందించారు. ఓపెన్ గా చెప్పాలంటే బయోపిక్ అని ప్రకటించిన కథలు కూడా కల్పితాలే. 70,80 ఏళ్ల వ్యక్తి జీవితాన్ని మూడు గంటల్లో కల్పితం లేకుండా ఎవరైనా చెప్పగరలా.. అంతేకాదు ఉనంతమైన మానవీయ భావాలతో రాసే కథలు అంతకన్నా కల్పితంగా ఉంటాయి. రాజకీయం శత్రుత్వాన్ని పెంచడం కాదు.. కృష్ణమ నాయుడు పేదరికం తనకున్న నత్తి లాంటి బలహీనతలను దాటి నాయకుడిగా ఎదిగిన పాత్ర గురించి అంటూ రాసుకొచ్చారు.
మయసభ సినిమాలో ఆది పినిశెట్టి, చైతన్య రావు లీడ్ రోల్స్ లో నటించారు. సోనీ లివ్ ఒరిజినల్ గా ఈ సినిమా వస్తుంది. ఇద్దరు స్నేహితులు తర్వాత పొలిటికల్ అపోనెంట్స్ గా ఎలా మారారు అన్నదే ఈ సినిమా కథ. ఐతే తెలుగు ప్రజలకు బాగా సుపరిచితమైన ఇద్దరు నాయకులను పోలి ఈ కథ ఉండటం వల్ల వారి జీవితం ఆధారంగానే ఈ సినిమా తీశారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.
అంతేకాదు టీజర్ చూస్తే ఈ సినిమాలో కొన్ని దేవా కట్టా ప్రస్తావించిన కల్పిత కథనాలు కూడా కాస్త హడావిడి చేసేలా ఉన్నాయి. డైరెక్టర్ గా ఇప్పటికే చాలామంది సినిమాలను అందించిన దేవా కట్టాకి ఈ కథ చెప్పాలని ఎందుకు అనిపించిందో సినిమా చూస్తే తెలుస్తుంది.
