Begin typing your search above and press return to search.

మే నెల.. టాలీవుడ్ బాక్సాఫీస్ సంగతేంటి?

మే నెల కంప్లీట్ అయిపోయింది.. జూన్ నెల స్టార్ట్ అయిపోయింది.. ఎప్పటిలానే గత నెలలో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియేటర్స్ లో సందడి చేశాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2025 3:00 AM IST
మే నెల.. టాలీవుడ్ బాక్సాఫీస్ సంగతేంటి?
X

మే నెల కంప్లీట్ అయిపోయింది.. జూన్ నెల స్టార్ట్ అయిపోయింది.. ఎప్పటిలానే గత నెలలో వివిధ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియేటర్స్ లో సందడి చేశాయి. కొన్ని సినీ ప్రియులను అలరించాయి. మరికొన్ని మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇంకొన్ని నిరాశపరిచాయి. అలా మే నెల బాక్సాఫీస్ సంగతేంటో చూద్దాం.

నేచురల్ స్టార్ నాని హిట్-3 మూవీతో మే నెల గ్రాండ్ గా స్టార్ట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఆ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొనగా.. మేకర్స్ వాటిని బాగా పెంచారు. రూ.43 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన ఆ సినిమా.. ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి వెళ్లింది. ఓవరాల్ గా భారీ వసూళ్లు రాబట్టింది.

హిట్ 3తో పాటు రెండు డబ్బింగ్ మూవీస్ రెట్రో, తుడారం అప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్చ నటించిన రెట్రో.. బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. తుడారం కొందరు మూవీ లవర్స్ ను మెప్పించినా.. వసూళ్ల పరంగా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

మే రెండో వారంలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన శుభం మూవీ థియేటర్స్ లో రిలీజైంది. నిర్మాతగా సామ్.. ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయింది. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టలేదని టాక్ వినిపించింది. కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ వల్ల సమంతకు మూవీ పరంగా ఎలాంటి నష్టాలు మాత్రం రాలేదని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

ఆ తర్వాత వచ్చిన యంగ్ హీరో శ్రీవిష్ణు మూవీ సింగిల్ అదరగొట్టింది. మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. మంచి వసూళ్లు కూడా రాబట్టింది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్ అయ్యి అలరించింది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు సాధించింది.

ఇప్పుడు లాస్ట్ వీక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం రిలీజ్ అవ్వగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా రీ రిలీజ్ అయింది. వసూళ్ల విషయంలో భైరవంపై ఖలేజా ఎఫెక్ట్ పడిందని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన షష్టిపూర్తి ఎలాంటి మార్క్ చూపించలేకపోయింది. అలా మే నెల పూర్తి అయిపోయింది!