మే 1న బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ
వాటిలో మొదటిగా తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్3 సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 22 April 2025 4:28 PM ISTబాక్సాఫీస్ వద్ద ప్రతీ వారం మినిమం రెండు మూడు సినిమాలు రిలీజ్ అవడం కామన్. కానీ ఒకే రోజు బజ్ బాగా ఉన్న సినిమాలు మాత్రం ఎక్కువ రిలీజ్ కావు. మహా అయితే రెండు మోస్ట్ అవెయిటెడ్ సినిమాలు ఒకేరోజు రిలీజవుతాయి. సంక్రాంతికి లేదా సమ్మర్ లో మాత్రమే బజ్, హైప్ తో సంబంధం లేకుండా ఒకేరోజు ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఇప్పుడు మే 1న కూడా బాక్సాఫీస్ వద్ద అలాంటి పోటీనే ఉండబోతుంది. సమ్మర్ సీజన్ ను వాడుకునేందుకు ఒకే రోజు ఐదు భాషల నుంచి సినిమాలు పోటీ పడనున్నాయి. దీంతో ఈ సమ్మర్ ఫైట్ ఏయే సినిమాల మధ్య ఉందా? వాటిలో ఏ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందా అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే ముందుగా మే 1న రిలీజ్ కానున్న సినిమాలేంటో చూద్దాం.
వాటిలో మొదటిగా తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్3 సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తోన్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ హీరోగా నటించిన రైడ్2 కూడా అదే రోజున రిలీజ్ కానుంది. రైడ్ 2 సినిమా ఇప్పటికే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది.
మౌనీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ది భూత్నీ సినిమా మే 1వ తేదీనే థియేటర్లలో రిలీజవుతుంది. ఇక కోలీవుడ్ నుంచి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా రిలీజవుతుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీపై ఆల్రెడీ కోలీవుడ్ లో మంచి బజ్ నెలకొంది.
కోలీవుడ్ నుంచి టూరిస్ట్ ఫ్యామిలీ అనే మరో సినిమా కూడా మే 1న రిలీజ్ కానుంది. ఇక మలయాళం నుంచి అభ్యంతరకుట్టావలి అనే సినిమా మే 1న రిలీజవుతోంది. ఈ మూవీలో ఆసిఫ్ అలీ నటిస్తున్నారు. వీటితో పాటూ మార్వెల్ స్టూడియోస్ నుంచి సూపర్ హీరో మూవీగా థండర్‌బోల్ట్స్ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. అంటే మే 1 న 5 భాషల నుంచి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయన్నమాట. మరి వీటిలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.
