Begin typing your search above and press return to search.

పుష్ప మీటర్ లో మట్కా..?

కరుణ కుమార్ తన ప్రతి సినిమాలో విలేజ్ వాతావరణాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మట్కాతో మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2023 9:32 AM GMT
పుష్ప మీటర్ లో మట్కా..?
X

టాలీవుడ్ లో ఈమధ్య పీరియాడికల్ సినిమాల హవా కొనసాగుతుంది. ప్రస్తుతం కథల కన్నా కొంతకాలం క్రితం జరిగిన కథలు.. అక్కడి పరిస్థితులను చూపి ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు. రంగస్థలం, పుష్ప ఇలా అన్ని సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇక లేటెస్ట్ గా మరో క్రేజీ సినిమా ఇదే స్కేల్ లో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సెట్స్ మీద కొన్ని పీరియాడికల్ సినిమాలు ఉన్నాయి. లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా మట్కా అంటూ మరో సినిమాతో వస్తున్నాడు.

పలాస 1978 సినిమా డైరెక్ట్ చేసిన కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఓ రేంజ్ లో ఉంది. టైటిల్ పోస్టర్ తోనే మట్కా సినిమాపై బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

ముఖ్యంగా సినిమా మీద అంచనాలు పెంచేలా పీరియాడికల్ కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తుంది. రంగస్థలం సినిమా తెలుగు వరకే హిట్ అయినా పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యింది. పుష్ప తరహాలోనే ఇప్పుడు ఈ వరుణ్ తేజ్ మట్కా సినిమా వస్తుంది.

కరుణ కుమార్ తన ప్రతి సినిమాలో విలేజ్ వాతావరణాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మట్కాతో మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నారు. ఈ సినిమాను వైరా క్రియేషన్స్ బ్యానర్ లో మోహన్ చెరుకూరి, విజయేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. జివి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

విలేజ్ కథలు చెప్పడంలో పట్టు ఉన్న కరుణ కుమార్ ఈసారి అదే తరహాలో మట్కా అంటూ రాబోతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎలా ఉంటాడు.. సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో సెకండ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా వస్తుంది.

వరుణ్ తేజ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీ అవుతుందని చెప్పొచ్చు.వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాండివధారి అర్జున సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ అంచనాలు పెంచింది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మట్కాతో పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయాలని చూస్తున్నాడు.