Begin typing your search above and press return to search.

'మట్కా' ముగ్గురు ముద్దుగుమ్మల కహానీ..!

హీరోయిన్స్ గా ఇప్పటికే మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ మరియు సలోనీ లను ఎంపిక చేశారట

By:  Tupaki Desk   |   16 March 2024 6:06 AM GMT
మట్కా ముగ్గురు ముద్దుగుమ్మల కహానీ..!
X

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, కరుణ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'మట్కా'. ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ నటించబోతున్నారు అనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.


హీరోయిన్స్ గా ఇప్పటికే మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ మరియు సలోనీ లను ఎంపిక చేశారట. మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్ కాగా నోరా ఫతేహీ ఐటెం సాంగ్‌ చేయబోతుంది... సలోని కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ అంతా భావించారు. కానీ ముగ్గురికి కూడా కథ లో కీలక ప్రాముఖ్య ఉంటుందట.

నోరా ఫతేహీ కేవలం ఐటెం సాంగ్‌ కే పరిమితం కాకుండా ఆమె పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయబోతున్నారు. ఆమె నుంచి చిత్ర యూనిట్‌ సభ్యులు 36 రోజుల కాల్‌ షీట్స్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇక సలోని పాత్ర కూడా చిన్నదేం కాదని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

కరుణ కుమార్‌ చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముగ్గురు హీరోయిన్స్‌ పాత్రలు ఎలా ఉంటాయి, హీరో పాత్ర ఎలా ఉండబోతుంది అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వరుణ్‌ గత చిత్రాలు నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా పై అభిమానులు నమ్మకం పెట్టుకుని వెయిట్‌ చేస్తున్నారు.