Begin typing your search above and press return to search.

మట్కా.. జాగ్రత్త మంచిదే సుమా..!

ఈ సినిమా విషయంలో మేకర్స్ ఆలోచన మార్చుకున్నారని తెలుస్తుంది. మట్కా సినిమాకు మొదట 50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాలని అనుకున్నారు

By:  Tupaki Desk   |   28 Sep 2023 11:23 AM GMT
మట్కా.. జాగ్రత్త మంచిదే సుమా..!
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన గని నిరాశపరచగా రీసెంట్ గా వచ్చిన గాండీవదారి అర్జున కూడా ఫ్లాప్ అయ్యింది. సినిమాల విషయంలో వరుణ్ తేజ్ లెక్కలు ఎలా ఉన్నా వరుస ఫ్లాపులు అతని మార్కెట్ ని దెబ్బతీస్తున్నాయని చెప్పొచ్చు. రెండు వరుస ఫ్లాపుల తర్వాత వరుణ్ తేజ్ మట్కా అంటూ ఒక పీరియాడికల్ మూవీని చేస్తున్నాడు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాను కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఈ సినిమా విషయంలో మేకర్స్ ఆలోచన మార్చుకున్నారని తెలుస్తుంది. మట్కా సినిమాకు మొదట 50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాలని అనుకున్నారు. కానీ వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమా ఘోరంగా పోవడంతో అంత బడ్జెట్ తో రిస్క్ అని ఆలోచిస్తున్నారట. అందుకే బడ్జెట్ ని తగ్గించాలని ఫిక్స్ అయ్యారట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాను అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. 2024 సమ్మర్ లో సినిమా రిలీజ్ ఉంటుందని టాక్. వరుణ్ తేజ్ మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. బాహుబలి భామ నోరా ఫతేహి కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వరుణ్ తేజ్ ఈ సినిమాతో పాటుగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ లో ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ ఉంటుంది.

మెగా హీరోల్లో ప్రత్యేకమైన సినిమాలతో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న వరుణ్ తేజ్ ప్రయోగాలు సరే కానీ కమర్షియల్ గా సినిమాలు వర్క్ అవుట్ అవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ హిట్ సినిమా చేస్తే ఫ్యాన్స్ ఖుషి అవుతారు. మట్కా విషయంలో ఎక్కడ తేడా రాకుండా చూస్తున్నారట. ఈ సినిమా అయినా మెగా ప్రిన్స్ ని గట్టెక్కిస్తుందా లేదా అన్నది చూడాలి.

మిగతా మెగా హీరోలంతా కూడా సక్సెస్ లతో దూసుకెళ్తుంటే రేసులో వెనకబడి ఉన్నాడు వరుణ్ తేజ్. కెరీర్ విషయంలో అతని ఆలోచన ఎలా ఉన్నా వరుణ్ తేజ్ తిరిగి హిట్ ఫాం లోకి రావాలని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్.