Begin typing your search above and press return to search.

VT14: మెగా ప్రిన్స్ 'మట్కా' షురూ

మట్కా కథను 24 ఏళ్ళ టైమ్ పిరియాడ్ ను హైలెట్ చేస్తారట

By:  Tupaki Desk   |   27 July 2023 8:22 AM GMT
VT14: మెగా ప్రిన్స్ మట్కా షురూ
X

మెగా హీరో వరుణ్ తేజ్ రెగ్యులర్ సినిమాలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు విభిన్నమైన సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఇక ఇప్పుడు అతను సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులకు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రతి సినిమా కథలో కూడా ఏదో ఒకటి డిఫరెంట్ పాయింట్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాంఢీవదారి అర్జున అనే ఒక స్పై యాక్షన్ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత దానికి భిన్నంగా మరొక పీరియడ్ సినిమా చేస్తూ ఉండడం విశేషం. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రానుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ సినిమా కోసం పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో చేతులు కలిపారు. మోహన్ చెరుకూరి (CVM) మరియు వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ ఎత్తున తెరకెక్కుతున్న #VT14 చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో టీమ్ పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా లాంచ్ చేయబడింది.

సురేష్ బాబు నిర్మాతలు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు మారుతి కెమెరా స్విచాన్ చేయగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ను వినిపించారు. ఇక దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. టైటిల్ పోస్టర్‌ను హరీష్ శంకర్ ఆవిష్కరించారు. #VT14 అనే టైటిల్‌ను ఆసక్తికరంగా 'మట్కా'గా పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా రూపొందించబడింది. మట్కా అనేది ఒక రకమైన జూదం. 1958-1982 మధ్య జరిగే ఈ కథ యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిందట.

ఈ కథ వైజాగ్ నేపథ్యంలో జరుగుతుంది. మట్కా కథను 24 ఏళ్ళ టైమ్ పిరియాడ్ ను హైలెట్ చేస్తారట. 1958 నుంచి 82 వరకు సాగే కథలో వరుణ్ తేజ్ ని నాలుగు డిఫరెంట్ గెటప్ లలో చూడబోతున్నట్లు తెలిపారు. అత్యధిక బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ చిత్రం కోసం వరుణ్ పూర్తి మేక్ఓవర్ ను చేంజ్ చేయబోతున్నారు.

వరుణ్ తేజ్ సరసన నటించేందుకు నోరా ఫతేహి , మీనాక్షి చౌదరి ఎంపికయ్యారు. ఇక ఈ పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌ల్9 నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఈ సినిమా కోసం 60వ దశకంలో వైజాగ్‌ను తలపించే భారీ పాతకాలపు సెట్‌ను నిర్మించనున్నారు. 60వ దశకంలోని వాతావరణాన్ని మరియు అనుభూతిని పొందడానికి బృందం నిజానికి అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్. ఇక సౌత్‌లో అత్యంత బిజీ గా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియాసేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.