'మట్కా' ప్లాప్ తో బ్యాక్ టూ పెవిలియన్!
మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ తెరకెక్కించిన `మట్కా` పాన్ ఇండియాలో భారీ అంచ నాల మద్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 May 2025 3:30 PMమెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ తెరకెక్కించిన `మట్కా` పాన్ ఇండియాలో భారీ అంచ నాల మద్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమా కోసం కరుణ్ కుమార్ ను ఎంతో సానబెట్టారు. రైటింగ్ ..మేకింగ్, మెగా క్యాంప్ లో కొంత కాలం పాటు పనిచేసిన తర్వాత...అతడిపై నమ్మకం వచ్చిన తర్వాత `మట్కా` చిత్రాన్ని మొదలు పెట్టి రిలీజ్ చేసారు.
కానీ వాళ్ల నమ్మకాన్ని మాత్రం కరుణ్ నిలబెట్టలేకపోయాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఊహించని ఫలితాన్ని సాధించింది. దీంతో భారీ నష్టాలు తప్పలేదు. సక్సెస్ అయితే దర్శకుడిగా మంచి అవకాశాలుండేవి. టైర్ 2 హీరోలు అవకాశాలిచ్చేవారు. అక్కడ నుంచి స్టార్ డైరెక్టర్ల జాబితాలోనూ చేరేవారు. కానీ ఆయన మళ్లీ బ్యాక్ టూ పెవిలియన్ అంటూ ఎక్కడ మొదలయ్యారో? అక్కడికే వెళ్తున్నట్లు కనిపిస్తుంది.
ప్రస్తుతం నవీన్ చంద్ర హీరోగా `హనీ` అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడే కరుణ కుమార్ కెరీర్ ఎంతగా టర్నింగ్ తీసుకుంది అన్నది తేట తెల్లమవుతుంది. వరుణ్ తేజ్ ని డైరెక్టర్ చేసిన కరుణ్ నవీన్ చంద్రను డైరెక్ట్ చేసే సరికి అతడి డౌన్ ఫాల్ క్లియర్ గా కనిపిస్తుంది. నవీన్ చంద్ర హీరోగా కెరీర్ ప్రారంభిం చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. అక్కడ సక్సస్ అవ్వడంతో మళ్లీ ఈ మధ్య హీరోగా సినిమాలు చేస్తున్నాడు. వరుణ్ మాత్రం కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటికీ స్టార్ గానే కొనసాగుతున్నాడు.
మధ్యలో ఎలాంటి డీవియేషన్స్ లేవు. అలా నవీన్-వరుణ్ మధ్య పనిచేసిన కరుణ కుమార్ ను చూడాల్సి న సన్నివేశం. `పలాస 1978` అనే చిత్రంతో కరుణ కుమార్ కెరీర్ మొదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అటుపై చేసిన `శ్రీదేవి సోడా సెంటర్`యావరేజ్ గా ఆడింది. కథల విషయంలో కరణ్ యూనిక్ థాట్ ప్రోసస్ మాత్రమే మెగా క్యాంపు కు దగ్గర చేసింది. కానీ వైఫల్యంతో మంచి అవకాశాలు కోల్పోతున్నాడు. మళ్లీ బౌన్స్ బ్యాక్ ఎప్పుడవుతాడో.