Begin typing your search above and press return to search.

50 ఏళ్ల వయసులో హీరోగా టర్న్‌ అవ్వబోతున్న మాస్టర్‌..!

టాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాల ప్రేక్షకులకు పీటర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

By:  Tupaki Desk   |   5 Jan 2024 6:07 AM GMT
50 ఏళ్ల వయసులో హీరోగా టర్న్‌ అవ్వబోతున్న మాస్టర్‌..!
X

టాలీవుడ్‌ యాక్షన్‌ సినిమాల ప్రేక్షకులకు పీటర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా ఇండియన్ భాషల సినిమాలన్నీంటికి కూడా యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేసిన ఫైట్ మాస్టర్‌ పీటర్ హెయిన్ అనడంలో సందేహం లేదు.

స్టార్‌ హీరోలతో ప్రేక్షకులు అబ్బుర పోయి చూసే విధంగా ఫైట్స్ చేయించిన పీటర్ హెయిన్‌ ఇప్పుడు తాను హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఎండి సినిమాస్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు.

ఇటీవలే ప్రముఖ స్టంట్స్‌ మాస్టర్స్‌ అయిన అన్బు - అరివ్‌ లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వారి దారిలోనే పీటర్‌ హెయిన్‌ కూడా హీరోగా ఎంట్రీ కి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే కథ సిద్ధం అయింది, దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

అయిదు పదుల వయసులో పీటర్ హెయిన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో చాలా సినిమాల్లో నటించి, కనిపించిన పీటర్‌ హెయిన్‌ ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేయబోతున్నాడు.

తనకు ఉన్న పాన్‌ ఇండియా ఇమేజ్ నేపథ్యంలో తమిళంలో రూపొందబోతున్న సినిమాను అన్ని భాషల్లో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 2024 లో ప్రారంభించి, 2025 కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి.