మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. భరత్ తల్లి మాతృమూర్తి కమలాసిని మృతి చెందారు.
By: Tupaki Desk | 19 May 2025 1:21 PM ISTటాలీవుడ్ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. భరత్ తల్లి మాతృమూర్తి కమలాసిని మృతి చెందారు. మే 18 ఆదివారం రాత్రి చెన్నైలో కమలాసిని కన్ను మూశారు. దీంతో భరత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఈ విషాదం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు భరత్ కు ఫోన్ చేసి ఓదారుస్తూ అతని తల్లి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కమలాసిని ఆదివారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న భరత్ కుటుంబ సభ్యులతో పాటూ పలువురు ప్రముఖులు చెన్నైలోని భరత్ ఇంటికెళ్లి ఆమె భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు.
భరత్ తల్లి మరణం పట్ల అటు టాలీవుడ్ లోనూ, ఇటు కోలీవుడ్ లోనూ తీవ్ర విషాదం నెలకొంది. భరత్ తల్లి మృతి పట్ల సెలబ్రిటీలు, కో యాక్టర్లు భరత్ కు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.
బాల్య నటుడిగా భరత్ సుమారు 80కి పైగా సినిమాల్లో నటించాడు. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించి తనదైన కామెడీతో తెలుగు ఆడియన్స్ ను అలరించి మెప్పించాడు. మధ్యలో స్టడీస్ కారణంతో ఇండస్ట్రీకి దూరమైన భరత్ చిన్నప్పుడు చాలా బొద్దుగా కనిపించాడు. కానీ తర్వాత రీఎంట్రీ టైమ్ లో మాత్రం సన్నగా స్లిమ్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. భరత్ చివరిగా గోపీచంద్ నటించిన విశ్వం సినిమాలో కనిపించాడు.
