Begin typing your search above and press return to search.

'కృష్ణ' కాంబో రిపీట్‌.. మాస్‌ కి పండుగే

కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. అలా మర్చిపోలేని రవితేజ సినిమాల్లో 'కృష్ణ' ఒకటి అనడంలో సందేహం లేదు

By:  Tupaki Desk   |   25 Oct 2023 9:22 AM GMT
కృష్ణ కాంబో రిపీట్‌.. మాస్‌ కి పండుగే
X

కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. అలా మర్చిపోలేని రవితేజ సినిమాల్లో 'కృష్ణ' ఒకటి అనడంలో సందేహం లేదు. రవితేజ లోని మాస్ యాంగిల్ ను ఎంత వరకు చూపించవచ్చో అంత వరకు చూపించిన దర్శకుడు వివి వినాయక్‌ ఆ సినిమా తో సూపర్‌ హిట్ ని అందుకున్నాడు. ఇద్దరి కాంబోలో వచ్చిన కృష్ణ మూవీ ఓ మాస్‌ బ్లాక్ బస్టర్ గా అప్పట్లో నిలిచింది.

రవితేజ, వినాయక్‌ కాంబోలో గతంలో మళ్లీ సినిమా రావాల్సి ఉన్నా కూడా ఇద్దరూ కూడా కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉండటంతో కొత్త సినిమా కు ఛాన్స్ రాలేదు. వినాయక్‌ ఈ మధ్య కాలంలో దర్శకుడిగా పూర్తిగా విఫలం అయ్యాడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఖైదీ నెం.150 సినిమా తర్వాత ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేదు.

వినాయక్ తాజా చిత్రం హిందీ 'చత్రపతి' మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ సినిమా ఫలితం ఏంటో ఇప్పటికే తేలిపోయింది. ఇక వినాయక్ సినిమాలను వదిలేస్తాడేమో అని అంతా అనుకుంటున్నారు.

బ్యాక్ టు బ్యాక్‌ ఫ్లాప్స్ పడ్డా కూడా వినాయక్‌ కి ఇండస్ట్రీ లో మంచి పేరు ఉంది. అందుకే ఆయన దర్శకత్వంలో నటించేందుకు హీరో లు సిద్ధంగానే ఉంటారు. అయితే మంచి కథ ను పట్టడంలో వినాయక్‌ విఫలం అవుతున్నాడు. ఎట్టకేలకు ఓ మంచి కథ తో రవితేజ ను సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రవితేజ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేస్తున్నాడు. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న రవితేజ తన ప్రస్తుత సినిమా లు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అంటే వచ్చే ఏడాది లో వినాయక్‌ తో సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రవితేజ వంటి మాస్‌ హీరో తో యాక్షన్ సినిమాల దర్శకుడు వినాయక్‌ కి మంచి ఛాన్స్ దక్కింది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.