Begin typing your search above and press return to search.

మాస్ రాజా.. ఇన్నాళ్ళకు కిక్కచ్చే కాంబో..

జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుదీప్ తో సింగిల్ లైనర్ కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:28 AM GMT
మాస్ రాజా.. ఇన్నాళ్ళకు కిక్కచ్చే కాంబో..
X

మాస్ మహారాజ్ రవితేజ ఇప్పుడంటే యాక్షన్ డోస్ కాస్తా ఎక్కువ అయ్యింది కానీ కెరియర్ ఆరంభంలో యాక్షన్, అండ్ కామెడీ జోడించిన కమర్షియల్ ఎంటెర్టైనెర్స్ ఎక్కువ చేసేవారు. నిజానికి రవితేజకి ఎక్కువ సక్సెస్ లు కూడా ఎంటర్టైన్మెంట్ తోనే వచ్చాయి. రాజా ది గ్రేట్, ధమాకా కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాయి.

అతని టైమింగ్ కామెడీని ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే పూర్తిస్థాయిలో రవితేజ కామెడీ సినిమాలు చేసి చాలా కాలమైంది. విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ లో కావాల్సినంత హ్యూమర్ ని రవితేజ జెనరేట్ చేశారు. అలాగే దుబాయ్ శీను, వెంకీ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోసారి ఆ స్థాయిలో అసలైన కాంబినేషన్ లో ఫుల్ ఎంటెర్టైన్ చేయడానికి రవితేజ సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.

జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనుదీప్ తో సింగిల్ లైనర్ కామెడీతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. తరువాత శివ కార్తికేయన్ తో ప్రిన్స్ మూవీ చేశాడు. ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే అందులో కూడా కామెడీ బాగానే పండింది. అనుదీప్ సినిమాలు అంటేనే అస్సలు లాజిక్ లేకుండా ఉంటాయి. అయినా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

ఈ సారి మాస్ మహారాజ్ రవితేజతో అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయించడానికి అనుదీప్ సిద్ధం అయిపోయాడని టాక్. ఇప్పటికే కథని రవితేజకి చెప్పడం, ఆయన ఒకే చెయ్యడం జరిగిపోయిందని తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ కథతో ఈ మూవీకి అనుదీప్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడంట. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది. ఇక రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

కన్నడంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాలో నటించిన రుక్మిణీ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యిందని టాక్. మే లేదా జూన్ నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఒక బ్లాక్ బస్టర్, రెండు డిజాస్టర్స్ తో ఉన్న అనుదీప్ మాస్ మహారాజ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.