Begin typing your search above and press return to search.

మాస్ రాజా కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ..!

మాస్ రాజా రవితేజ సినిమాల వేగం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా రిజల్ట్ ఏంటన్నది అసలు పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటాడు రవితేజ

By:  Tupaki Desk   |   16 Nov 2023 7:38 AM GMT
మాస్ రాజా కోసం ఆ ఇద్దరి మధ్య పోటీ..!
X

మాస్ రాజా రవితేజ సినిమాల వేగం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా రిజల్ట్ ఏంటన్నది అసలు పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటాడు రవితేజ. ఆయన నటించిన నేనింతే సినిమాలో క్లైమాక్స్ లో చెప్పినట్టుగా.. సినిమా హిట్ అయినా ఇంకో సినిమా చేయాలి.. సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా చేయాలి. మనకు సినిమా తప్ప ఇంకేం రాదురా అనే డైలాగ్ ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్ పడగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు నిరాశ పరిచాయి. అయితే హిట్ ని తలకి ఎక్కించుకొని.. ఫ్లాప్ కి కృంగిపోయే టైపు కాదు రవితేజ. అందుకే తన నెక్స్ట్ ఫోకస్ ఈగల్ మీద పెట్టాడు.

ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు మాస్ రాజా. ఈగల్ తర్వాత ఆల్రెడీ గోపీచంద్ డైరెక్షన్ లో మరోసారి క్రాక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు రవితేజ. గోపీచంద్ కి మొదటి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి అతని కెరీర్ కి హెల్ప్ ఫుల్ గా ఉన్న రవితేజ అతన్ని స్టార్ డైరెక్టర్ గా మలిచేందుకు తన సపోర్ట్ అందించాడు. క్రాక్, వీర సింహా రెడ్డి హిట్ల తర్వాత గోపీచంద్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ తో సినిమా కోసం ఇద్దరు దర్శకుల మధ్య పోటీ ఏర్పడుతుందని తెలుస్తుంది. రవితేజతో మరోసారి సినిమా చేయాలని ఇద్దరు దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇంతకీ ఎవరా డైరెక్టర్స్ అంటే ఒకరు హరీష్ శంకర్ మరొకరు అనిల్ రావిపుడి అని తెలుస్తుంది. డైరెక్టర్ గా హరీష్ శంకర్ కి మొదటి ఛాన్స్ ఇచ్చింది రవితేజానే అందుకే అతనితో సినిమా అంటే మాస్ రాజా కూడా ఓకే అనేస్తాడు. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టిన హరీష్ శంకర్ ఆ సినిమా ఇప్పుడప్పుడే పూర్తి చేయడం కష్టమని ఫిక్స్ అయ్యాడని టాక్. అందుకే రవితేజతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

రీసెంట్ గా భగవంత్ కేసరితో హిట్ అందుకున్న అనిల్ రావిపుడి కూడా రవితేజతో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట. ఈ ఇద్దరు దర్శకులు ఇదివరకు రవితేజతో సినిమా తీసి హిట్ అందుకున్నారు. మరి రవితేజ ఈ ఇద్దరిలో ఎవరిని పిక్ చేసుకుంటాడు ఎవరితో తన నెక్స్ట్ సినిమా ఉంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది.