Begin typing your search above and press return to search.

మాస్ రాజా సినిమాలో ఆ హీరో విలన్?

ఇప్పటికే స్టోరీ నేరేట్ చేయడం జరిగిందని దానికి మంచు మనోజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:18 AM GMT
మాస్ రాజా సినిమాలో ఆ హీరో విలన్?
X

మాస్ మహారాజ్ రవితేజ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అతను నటించిన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కి రెడీ అయ్యింది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరో వైపు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ మూవీ షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఇది కూడా తెరకెక్కుతోంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మూవీ కమిట్ అయ్యారు.

ఏడాదికి కనీసం మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా రవితేజ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రలో ఈ మూవీలో కనిపిస్తాడని టాక్ వచ్చింది. తాజాగా మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో రవితేజకి ప్రతినాయకుడిగా మంచు మనోజ్ నటించబోతున్నాడంట. సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ మరల రీసెంట్ గా వాట్ ది ఫిష్ అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్పారు. తరువాత మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు రవితేజకి విలన్ గా మంచు మనోజ్ ని దర్శకుడు సందీప్ రాజ్ ఖరారు చేసారంట.

ఇప్పటికే స్టోరీ నేరేట్ చేయడం జరిగిందని దానికి మంచు మనోజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. ఒక వేళ మంచు మనోజ్ గాని విలన్ గా నటిస్తే కచ్చితంగా మూవీకి మరింత హైప్ వస్తుంది. గతంలోనే మనోజ్ విలన్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అందుకే ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండటంతో మంచు మనోజ్ ని అప్రోచ్ అయ్యి ఫైనల్ చేసినట్లు టాక్.

త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఒకే స్క్రీన్ పై రవితేజ, మంచు మనోజ్, విశ్వక్ సేన్ కనిపిస్తే కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.