Begin typing your search above and press return to search.

మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇతర హీరోలకు సాధ్యం కానంత స్పీడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చాడు

By:  Tupaki Desk   |   1 Nov 2023 4:41 AM GMT
మాస్‌ జోరు.. రిలీజ్.. షూటింగ్ పూర్తి.. షూటింగ్ స్టార్ట్‌
X

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇతర హీరోలకు సాధ్యం కానంత స్పీడ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేసిన ఒకే ఒక్క హీరోగా కూడా రవితేజ నిలిచాడు. ఆ సమయంలో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో మాస్‌ రాజా కాస్త స్లో అయిన విషయం తెల్సిందే.

మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చిన రవితేజ మళ్లీ మునుపటి స్పీడ్ అందుకున్నాడు. హీరో గా రవితేజ కెరీర్ ఖతం అయిందని భావిస్తున్న సమయంలో క్రాక్ మరియు ధమాకా సినిమాలు విజయాలను సొంతం చేసుకోవడంతో ఆయన జోరు, జోష్ మళ్లీ పెరిగింది. మునుపటి మాదిరిగా ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేయాలని ఆశ పడుతున్నట్లు ఉన్నాడు.

అందుకు నిదర్శనమే.. తాజాగా విడుదల అయిన టైగర్ నాగేశ్వరరావు, మరో వైపు షూటింగ్‌ పూర్తి అయిన ఈగల్‌, షూటింగ్ ప్రారంభం అయిన గోపీచంద్‌ మూవీ అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తాజాగా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఉండి పోయింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం లో ఈగల్‌ సినిమాను పూర్తి చేశాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఈగల్‌ ను హడావుడిగా పూర్తి చేసిన రవితేజ వెంటనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. నాలుగు, అయిదు నెలల్లోనే వీరిద్దరి కాంబో మూవీ పూర్తి అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

మొత్తానికి రవితేజ మాస్‌ స్పీడ్ జర్నీ చూస్తూ ఉంటే యంగ్‌ హీరోలు కూడా అసూయ పడే విధంగా ఉందంటూ మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు. ఈ రేంజ్ లో సినిమాల ను స్పీడ్ గా చేస్తే రవితేజ ముందు ముందు సినిమాల సంఖ్య విషయంలో అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.