Begin typing your search above and press return to search.

మాస్ కాంబో ప్రాజెక్ట్.. రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్లు!

ఇప్పటికే సదరు హీరోతో మూవీ చేసిన పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ కాంబినేషన్ లో మూవీని నిర్మించడానికి రెడీ అవుతోంది.

By:  Tupaki Desk   |   15 Dec 2023 4:30 PM GMT
మాస్ కాంబో ప్రాజెక్ట్.. రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్లు!
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చాలా సినిమాలు కాంబినేషన్స్ మీద నడుస్తున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొంతమంది మూవీస్ చేస్తున్నారు. అలాగే ప్రొడక్షన్ హౌస్ లు కూడా చేసిన హీరోతో మళ్ళీ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఓ స్టార్ హీరో కమర్షియల్ డైరెక్టర్ తో రీసెంట్ రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాతలు రెడీ అయ్యారు.

ఇప్పటికే సదరు హీరోతో మూవీ చేసిన పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ కాంబినేషన్ లో మూవీని నిర్మించడానికి రెడీ అవుతోంది. సదరు దర్శకుడు కూడా ఓ పెద్ద హీరోతో మూవీ ఇప్పటికే స్టార్ట్ చేశారు. అయితే ఏవో కారణాల వలన ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ దర్శకుడు తన కెరీర్ కు మొదటి సక్సెస్ ఇచ్చిన ఫెవరెట్ మాస్ హీరోతో మూవీ చేయడానికి డిసైడ్ అయ్యాడు.

ఇక హీరో కూడా వెంటనే డేట్స్ ఇచ్చేయడంతో ఈ బాలీవుడ్ హిట్ మూవీని రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేసేశారు. ఈ సినిమా కోసం ఇప్పుడు హీరోయిన్స్ వేటలో దర్శకుడు పడ్డాడు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఓ నార్త్ ఇండియన్ బ్యూటీని హీరోయిన్ రోల్ కోసం సంప్రదించారంట. అయితే ఆమె చేతినిండా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేనని తిరస్కరించిందంట.

అలాగే సదరు హీరోతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన సీనియర్ బ్యూటీని కూడా సంప్రదించారంట. అయితే ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేకపోవడంతో ఆసక్తి చూపించలేదంట. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ కావడంతో ఆమె డిమాండ్ చేసినంత ఇవ్వడానికి నిర్మాతలు మొగ్గు చూపించలేదని టాక్.

దీంతో ఇప్పుడు మరో క్రేజీ బ్యూటీని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాతో ఈ బ్యూటీ సెన్సేషన్ అయ్యింది. దీంతో ఆమెని హీరోయిన్ గా తీసుకుంటే హైప్ క్రియేట్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావించి సంప్రదింపులు జరుగుతున్నారంట. ఒక వేళ ఆమె ఒకే అంటే తెలుగులో ఈ క్రేజీ హీరోయిన్ కి ఇదే మొదటి చిత్రం అవుతుంది.