మాస్ రాజా.. ఈసారి 'సూపర్ డూపర్'
మాస్ మహారాజా రవితేజ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటిస్తున్న 'మాస్ జాతర' చిత్రంపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు
By: Tupaki Desk | 22 Oct 2025 8:01 PM ISTమాస్ మహారాజా రవితేజ, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటిస్తున్న 'మాస్ జాతర' చిత్రంపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్ల వేగాన్ని మరింత పెంచారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన టీమ్, ఇప్పుడు మరో మాస్ నంబర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'మాస్ జాతర' ఆల్బమ్ నుంచి ఇప్పటికే 'తు మేరా లవర్', 'ఓలే ఓలే', 'హుడియో హుడియో' పాటలు విడుదలై చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో ఈ పాటలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ జోష్‌ను కంటిన్యూ చేస్తూ, నాలుగో పాటగా 'సూపర్ డూపర్' అనే ఫుల్ మాస్ బీట్ ని విడుదల చేశారు. ఈ పాట కూడా రవితేజ మార్క్ ఎనర్జీతో, శ్రీలీల డ్యాన్స్‌లతో ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా ఉంది.
ఈ 'సూపర్ డూపర్' పాట వింటుంటే, పాత రవితేజను గుర్తుచేసేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు, స్వాగ్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ఇక శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో మరోసారి తెరపై మ్యాజిక్ చేసింది. రవితేజ శ్రీలీల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
ఈ మాస్ బీట్‌ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తనదైన స్టైల్‌లో కంపోజ్ చేశారు. వినగానే కాలు కదిపేలా, హుషారు పుట్టించేలా ట్యూన్ ఉంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రోహిణి సోరట్‌తో కలిసి ఆలపించడం విశేషం. సురేష్ గంగుల అందించిన సాహిత్యం కూడా పాటకు తగ్గట్టుగా ఎంతో క్యాచీగా, ఉత్సాహంగా ఉంది. మ్యూజిక్, వోకల్స్, లిరిక్స్ అన్నీ కలిసి ఈ పాటను ఒక పర్ఫెక్ట్ మాస్ నంబర్‌గా మార్చాయని అంటున్నారు.
రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన భాను భోగవరపు, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టీజర్, పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ కూడా త్వరలోనే రానుంది.
