రవితేజ, శ్రీవిష్ణు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనా!
దీంతో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకుంటోన్న 'మాస్ జాతర', 'సింగిల్' చిత్రాలు మరో తేదీకి మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
By: Tupaki Desk | 12 April 2025 1:45 PM IST`హరిహర వీరమల్లు` రిలీజ్ దాదాపు ఖాయమైనట్లే. పాత పద్దతిలో మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందనుకున్నా? తాజాగా మరోసారి మే 9న రిలీజ్ పక్కా అంటూ ప్రకటించడంతో క్లారిటీ వచ్చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ అప్ డేట్స్ కూడా క్లియర్ గా ఇవ్వడంతో రిలీజ్ లాంఛనమేనని తెలుస్తుంది. దీంతో అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకుంటోన్న `మాస్ జాతర`, `సింగిల్` చిత్రాలు మరో తేదీకి మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వీరమల్లు రిలీజ్ వాయిదా పడితే ఆ డేట్ లో ఈ రెండు చిత్రాలు రిలీజ్ చేయాలనుకున్నారు. గతంలో వీరమల్లు వాయిదాలు ఆధారాన్ని బేస్ చేసుకుని ఈ రకమైన అంచనాకి వచ్చారు. దీనిలో భాగంగా రిలీజ్ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. కానీ నిన్నటి వీరమల్లు వివరణతో మే 9 వదులుకోవాల్సిందే. రవితేజ్ కథానాయకుడిగా మాస్ జాతర చిత్రాన్ని భాను బోగవరపు తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
రాజాకి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం. వరుస పరాజయాలతో మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉంది. మార్కెట్ మళ్లీ పుంజుకోవాలంటే హిట్ తప్పనిసరి. అలాగే రిలీజ్ సమయం కూడా అంతే కీలకం. రిలీజ్ కి అన్ని రకాలుగా కలిసి రావాలి. మే 9 అంటే సమ్మర్ సెలవులు కూడా ఇచ్చేసారు. ఎండలు తీవ్రంగా ఉండే సమయం అదే. అంతకు మించి రిలీజ్ ఆలస్యం చేస్తే ఎండ తీవ్రత మరింత ముదురుతుంది.
జనాలు థియేటర్ కి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఎంత వీలైంత అంత త్వరగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్ జాతర మే 9 తర్వాత మరో మంచి తేదీని చూసుకుని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అలాగే శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న `సింగిల్` చిత్రం పీకేకి పోటీ కాదు గానీ...నిర్మాత అల్లు అరవింద్ ఆ తేదీని మంచి రిలీజ్ తేదీగా భావించారు. కానీ ఇప్పుడాయన ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు.
