మాస్ జాతర.. ఇప్పుడప్పుడే రాదా?
చివరగా ప్రకటించిన రిలీజ్ డేట్ ఆగస్టు 27కు ఆ సినిమా రావట్లేదన్నది స్పష్టం. తర్వాతి ఆప్షన్ సెప్టెంబరు 12 అని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ డేట్‌కు కూడా సినిమా రావట్లేదు.
By: Tupaki Desk | 23 Aug 2025 7:49 PM ISTటాలీవుడ్లో చాలా వేగంగా సినిమాలు చేసే స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు. దాదాపుగా ప్రతి సంవత్సరం ఆయన సినిమా ఒకటి రిలీజవుతుంటుంది. కుదిరితే రెండు రిలీజ్‌లు ఉండేలా కూడా రవితేజ చూసుకుంటాడు. ఐతే గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో పలకరించిన మాస్ రాజా.. ఈ ఏడాది మాత్రం ఇంకా బాక్సాఫీస్ బరిలో దిగలేదు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ‘మాస్ జాతర’ కొంచెం ఆలస్యం అవుతోంది.
చివరగా ప్రకటించిన రిలీజ్ డేట్ ఆగస్టు 27కు ఆ సినిమా రావట్లేదన్నది స్పష్టం. తర్వాతి ఆప్షన్ సెప్టెంబరు 12 అని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ డేట్‌కు కూడా సినిమా రావట్లేదు. అసలు సెప్టెంబరులో రిలీజ్ చేసే ఆలోచనే లేదని తెలుస్తోంది. అక్టోబరులో, అది కూడా నెలాఖర్లో సినిమాను రిలీజ్ చేయడానికి చూస్తున్నారన్నది తాజా సమాచారం. రెండు వారాల ముందు వరకు ఆగస్టు 27ెన పక్కా అనుకున్న సినిమా.. రెండు నెలలు వెనక్కి వెళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయం.
‘మాస్ జాతర’ నుంచి కొన్ని వారాల ముందు రిలీజ్ చేసిన టీజర్‌కు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఏముంది ఇందులో, రొటీన్ మాస్ మసాలా సినిమా అంటూ పెదవి విరిచారు సోషల్ మీడియా జనాలు. అదే సమయంలో ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ కింగ్డమ్, వార్-2 చిత్రాలతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇలాంటి టైంలో ‘మాస్ జాతర’ను ఇప్పుడున్నట్లే రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర షాక్ తప్పదని ఆందోళన చెందుతున్నారట.
అందుకే ఇంకాస్త టైం తీసుకుని, సినిమాకు మెరుగులు దిద్ది, వీలైతే రీషూట్లు కూడా చేసి.. కొంచెం ఆలస్యంగా అయినా బెటర్ ఔట్ పుట్‌తో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొద్దామన్నది టీం ఆలోచనగా తెలుస్తోంది. సినిమా ఇలా వెనక్కి వెళ్లిపోవడం రవితేజ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే అయినా.. ఈ చిత్రం హిట్ కావడం మాస్ రాజాకు చాలా అవసరం కాబట్టి మంచి ఔట్ పుట్ కోసం వెయిట్ చేయక తప్పదు.
