'మాస్ జాతర' టార్గెట్ ఫిక్స్.. మరోసారి లక్ కలిసొస్తుందా?
2025 వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
By: Tupaki Desk | 29 May 2025 6:18 PM ISTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం మూవీ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
2025 వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 'ఈసారి గణేష్ ఉత్సవం థియేటర్స్ లో జరుపుకొందాం' అని తెలిపారు. అయితే పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ అంతా మాస్ లుక్ లో ఉండగా, మెడలో పూలదండతో జోవియల్ లుక్ లో రవితేజ కనిపించారు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మాస్ జాతర.. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ అయ్యేలా ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో ఆగస్టు 27వ తేదీన మాస్ పండుగను తీసుకురానుందని తెలుస్తోంది. అదే సమయంలో మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
కాగా, ఇప్పటికే ధమాకాలో రవితేజ, శ్రీలీల కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీతో ఇద్దరూ మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు రవితేజకు సరైన విజయం దక్కలేదు. గత ఏడాది రిలీజ్ అయిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు మెప్పించలేకపోయాయి. దీంతో మాస్ జాతరపై రవితేజ హోప్స్ పెట్టుకున్నారు.
అదే సమయంలో శ్రీలీల.. ధమాకా మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె సొంతమయ్యాయి. కానీ అనుకున్న స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. రీసెంట్ గా రాబిన్ హుడ్ మూవీ చేసినా.. ఆ చిత్రం మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. దీంతో ధమాకాతో హిట్ కొట్టిన లక్కీ పెయిర్ కు మళ్లీ లక్ కలిసి రావాలని అంతా కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
