'మాస్ జాతర'.. రవితేజ అందుకు నో చెప్పారట!
అందుకే ఆగస్టులో కింగ్ డమ్ ను రిలీజ్ చేయాలనుకుంటే.. 1వ తేదీన ఎంచుకోవాలి. కానీ అది జరుగుతుందో లేదో క్లియర్ గా తెలియదు.
By: Tupaki Desk | 23 Jun 2025 5:00 AM ISTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు మాస్ జాతర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే నిజానికి మే నెలలో మాస్ జాతర మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన మేకర్స్.. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు. వినాయక చవితి పండక్కి థియేటర్స్ లో మాస్ జాతరే అని తెలిపారు. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో కచ్చితంగా మాస్ జాతర.. ఆగస్టు 27న రిలీజ్ అవుతుందో లేదోనని కొందరు నెటిజన్లు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే.. మాస్ జాతర మేకర్స్ నిర్మిస్తున్న మరో మూవీ కింగ్ డమ్ చిత్రం రిలీజ్ డేట్ ను ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి ఆ సినిమాను స్పై జోనర్ లో రూపొందిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న ఆ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల లేట్ అయింది. ఇప్పుడు జూలై 25న లేదా ఆగస్టు 1న రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అదే జరిగితే పర్లేదు.. కానీ ఇంకా లేట్ అయితే మాస్ జాతరతో క్లాష్ అవుతుంది. ఒకే బ్యానర్ పై రెండు సినిమాలు.. దగ్గర దగ్గరలో రిలీజ్ అవ్వడం బిజినెస్ పరంగా ఇబ్బందే.
అందుకే ఆగస్టులో కింగ్ డమ్ ను రిలీజ్ చేయాలనుకుంటే.. 1వ తేదీన ఎంచుకోవాలి. కానీ అది జరుగుతుందో లేదో క్లియర్ గా తెలియదు. దీంతో మాస్ జాతరను మళ్లీ వాయిదా వేద్దామని రవితేజతో నిర్మాత నాగవంశీ అన్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. కానీ మాస్ మహారాజా నో చెప్పారట. అనుకున్న డేట్ కు రిలీజ్ చేయమని ఆదేశించారని టాక్.
ఎందుకంటే ఇప్పుడు రవితేజ మరో మూవీ కూడా చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అంటే ఆగస్టుకు మరో నాలుగు నెలల తర్వాత ఆ సినిమా రిలీజ్ కానుంది. అందుకే పోస్ట్ పోన్ కు రవితేజ నో చెప్పారని తెలుస్తోంది. దీంతో కింగ్ డమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.
