Begin typing your search above and press return to search.

నాకంత ధైర్యం లేదు అందుకే ఇలా కంటున్నా!

ఫేమ‌స్ మ‌సాబా గుప్తా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెల‌బ్రిటీ ఈవెంట్ల‌తోనే ఆమె ఎంతో ఫేమ‌స్

By:  Tupaki Desk   |   19 April 2024 10:47 AM GMT
నాకంత ధైర్యం లేదు అందుకే ఇలా కంటున్నా!
X

ఫేమ‌స్ మ‌సాబా గుప్తా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సెల‌బ్రిటీ ఈవెంట్ల‌తోనే ఆమె ఎంతో ఫేమ‌స్. డిజైన‌ర్ గా ఎంతో పాపుల‌ర్ అయిన మ‌సాబా త‌న క్రియేటివిటీతో ఆ రంగంలో మంచి విజ‌యం సాధించింది. `మాసాబా` అనే డాక్యు సిరీస్ చేసి అదే టైటిల్ ని త‌న ఇంటిపేరుగా మార్చేసుకుంది. ఆమె వాస్త‌వ పేరు కంటే? మ‌సాబా గుప్తా అంటేనే అంతా గుర్తుప‌డుతుంటారు. అంత‌గా ఆ పేరుతో వైర‌ల్ అయింది. గ‌త ఏడాదే ఆమె న‌టుడు స‌త్య‌దీప్ మిశ్రాని పెళ్లి చేసుకుంది. తాజాగా ఈ దంప‌తులు ఏడాది తిర‌గ‌కుండానే గుడ్ న్యూస్ చెప్పేసారు.

తాను త‌ల్లి కాబోతున్న‌ట్లు మ‌సాబా గుప్తా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. మాజీవితాల్లోకి రెండు బుల్లి అడుగులు రాబోతున్నాయి. మీరంతా మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించాల్సిన స‌మ‌యం అంటూ కోరింది. బేబి బంప్ తో ఉన్న కొన్ని ఎమోజీల‌ను కూడా పోస్ట్ చేసింది. దీంతో బాలీవుడ్ సెబ్రిటీలు..తెలిసిన వారు అంతా ఆమెకి విషెస్ తెలియ జేస్తున్నారు. సింగిల్ పేరేంట్ కావ‌డం కానీ..పెళ్లికాకుండా బిడ్డ‌ను క‌న‌డం గానీ త‌న‌కి ఎంత మాత్రం ఇష్టం లేవు అంది. పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని క‌నే కాన్సెప్ట్ ఎంతో విలువైన‌ది గా పేర్కోంది.

పెళ్లికాకుండానే పుట్టిన త‌ను స‌మాజంలో చాలా ర‌కాల అవ‌మానాలు ఎదుర్కున్నాన‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంది. ఆధునికంగా ఉండ‌టం అద్భుతంగా ఉన్నాఅవ‌మానాలు మాత్రం దారుణంగా ఉంటాయంది. మ‌సాబా గుప్తా త‌ల్లిదండ్రులు పెళ్లికాకుండానే ఆమెని క‌న్నారు. బాలీవుడ్ న‌టి నీనా గుప్తా- వెస్టీండీస్ క్రికెట‌ర్ వినియ‌న్ రిచ‌ర్స్డ్ ల‌వ్ స్టోరీ అంద‌రికీ తెలిసిందే. వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోకుండానే మ‌సాబా గుప్తాని క‌న్నారు.

అప్ప‌ట్లో అది పెద్ద సంచ‌ల‌నం. ఆ త‌ర్వాత మసాబా గుప్తాని త‌ల్లి ఒంట‌రిగానే పెంచి ప్ర‌యోజ‌కురాల్ని చేసింది. అందుకు భిన్నంగా కుమార్తె మాత్రం ఎంతో ప‌ద్ద‌తిగా పెళ్లి చేసుకుని గ‌ర్భం విష‌యాన్ని ప్ర‌క‌టించింది. విదేశీ క‌ల్చ‌ర్ లో ఉన్నా పెళ్లి కాకుండా బిడ్డ‌ను క‌న‌డం అన్న‌ది ఇప్ప‌టికీ త‌లంపుగానే ఉంది. అమీజాక్స‌న్ అలా బిడ్డ‌ను క‌ని ఎన్ని నింద‌లు మోసిందో తెలిసిందే.