Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ సిరీస్‌ ఫ్యాన్స్ కి బ్యాడ్‌ న్యూస్‌

మార్వెల్‌ లో ఉన్న ప్రతి ఒక్క నటీ నటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మార్వెల్‌ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న స్టార్‌ జోనాథన్ మేజర్స్.

By:  Tupaki Desk   |   19 Dec 2023 5:04 AM GMT
సూపర్ హిట్ సిరీస్‌ ఫ్యాన్స్ కి బ్యాడ్‌ న్యూస్‌
X

ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఇంగ్లీష్ సినిమా ప్రాంచైజీ మార్వెల్‌. ప్రతి పాత్రను కూడా ప్రేక్షకులు ప్రేమించారు.. మార్వెల్‌ లో ఉన్న ప్రతి ఒక్క నటీ నటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మార్వెల్‌ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న స్టార్‌ జోనాథన్ మేజర్స్.

ఇక ముందు మార్వెల్‌ సిరీస్ లో రాబోతున్న సినిమాలు, ఇతర సినిమాల నుంచి జోనాథన్‌ మేజర్స్ కనిపించబోడు అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. మాజీ ప్రియురాలు గ్రేస్ జబ్బారీ తో ఏర్పడిన వివాదంలో ఆయన ప్రవర్తన మరియు ఆయన పాల్పడిన భౌతిక దాడులకు సంబంధించిన కేసులో శిక్ష పడింది.

అప్పట్లో జబ్బారిపై దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ జోనాథన్‌ మేజర్స్‌ శిక్ష అనుభవించాల్సిందే అంటూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆయన్ను మార్వెల్‌ సిరీస్‌ నుంచి తప్పిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

కేవలం మార్వెల్‌ ప్రాంచైజీ నుంచి మాత్రమే కాకుండా డిస్నీ వరల్డ్‌ వారితో చేసుకున్న ఒప్పందాలను కూడా జోనాథన్‌ మేజర్స్‌ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మార్వెల్‌ లో జోనాథన్‌ లేక పోవడం కచ్చితంగా లోటు అన్నట్లుగా ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్వెల్‌ లో ఆ పాత్రను ఎవరితో రిప్లేస్ చేస్తారా అనే చర్చ మొదలైంది.