Begin typing your search above and press return to search.

ప్రభాస్​ - మారుతి సినిమా సీక్రెట్​గా ఉంచడానికి రీజన్ ఇదే

అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతీ మాట్లాడారు. అందుకు గల కారణాన్ని చెప్పేందుకు కాస్త ప్రయత్నించారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 5:34 AM GMT
ప్రభాస్​ - మారుతి సినిమా సీక్రెట్​గా ఉంచడానికి రీజన్ ఇదే
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి మార్క్.. హారర్ కామెడీ థ్రిల్లర్​గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి 'డీలక్స్ రాజా' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎటువంటి అనౌన్స్​మెంట్ లేకుండా షూట్​ స్టార్ట్ చేసి, కనీసం ఇప్పటివరకు ఒక్క అప్డేట్​ కూడా ఇవ్వకపోవడంతో అసలీ సినిమా ఉందా లేదా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

మరి ఎందుకు ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్​ ఇవ్వకుండా, ఏ విషయం బయటకు రాకుండా ఇంత సైలైంట్​గా ఉంచుతున్నారో సరైన సమాధానం కూడా ఇవ్వలేదు మూవీటీమ్. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు మారుతీ మాట్లాడారు. అందుకు గల కారణాన్ని చెప్పేందుకు కాస్త ప్రయత్నించారు.

ప్రభాస్​ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్​ను వదిలితే అటు ఫ్యాన్స్ ఇటు అభిమానులు గందరగోళానికి గురౌతారు. పైగా ముందుగానే వాటి అప్డేట్స్​ కూడా బయటకు వచ్చేస్తే.. సినిమాలు రిలీజ్ అయ్యే సమయానికి కాస్త హైప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటూ మారుతి తెలివిగా సమాధానం చెప్పారు.

కాగా, ప్రభాస్ - మారుతి సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. థ్రిల్లర్‌, రొమాంటిక్‌ అంశాలతో నిండిన వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. చిత్రంలో నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక ప్ర‌భాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్.. డిసెంబర్​లో రిలీజ్​కు రెడీ అయింది. మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న ప్రాజెక్ట్ కె కల్కి వచ్చే ఏడాది రానుంది. సందీప్​ వంగాతో చేయాల్సిన స్పిరిట్ ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. ఇంకా సీతారామం ఫేమ్​ హను రాఘవపూడితో పాటు మరో ఇద్దరు దర్శకులకు కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.