Begin typing your search above and press return to search.

డార్లింగ్ పై మారుతి ఇష్ట‌మే 'రాజాసాబ్'!

'ట్రూల‌వ‌ర్' అనే సినిమా ఈవెంట్ లో ఈ వ్యాఖ్య‌లు చేసాడు. 'నేను ప్ర‌భాస్ కు ట్రూల‌వ‌ర్ ని. ప్ర‌స్తుతం ఆయ‌న ప్రేమ‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆయ‌న‌పై నాకున్న ఇష్ట‌మంతా రాజాసాబ్ లో క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 1:18 AM GMT
డార్లింగ్ పై మారుతి ఇష్ట‌మే రాజాసాబ్!
X

పాన్ ఇండియాస్టార్ ప్ర‌భాస్ క‌థానాయకుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో 'రాజాసాబ్' అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వరుస‌గా పాన్ ఇండియాలు చేసి బోర్ కొట్టిన డార్లింగ్ మారుతితో రిలాక్స్ కోసం చేస్తోన్న మూవీ ఇది. ప‌క్కా మారుతి మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన ఫ‌స్ట్ లు క్ పోస్ట‌ర్ డార్లింగ్ అభిమానుల్ని ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

రాజాసాబ్ లో డార్లింగ్ ని మారుతి అందంగానే డిజైన్ చేసాడు. డార్లింగ్ హెయిర్ స్టైల్..ఆహార్యం ప్ర‌తీది కొత్త‌గా అనిపించింది. అలాగే ఈ సినిమా ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి మారుతి డార్లింగ్ అభిమానుల్ని ఎక్క‌డా నిరుత్సాహ ప‌ర‌చుకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు. సినిమా డిలే అయినా మారుతి ఆర‌కంగా అభిమానుల్ని మ్యానేజ్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. తాజాగా ప్ర‌భాస్ పై త‌న ఇష్ట‌మంతా రాజాసాబ్ లో చూపిస్తాన‌న‌ని అభిమానుల‌కు ప్రామిస్ చేసాడు.

'ట్రూల‌వ‌ర్' అనే సినిమా ఈవెంట్ లో ఈ వ్యాఖ్య‌లు చేసాడు. 'నేను ప్ర‌భాస్ కు ట్రూల‌వ‌ర్ ని. ప్ర‌స్తుతం ఆయ‌న ప్రేమ‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆయ‌న‌పై నాకున్న ఇష్ట‌మంతా రాజాసాబ్ లో క‌నిపిస్తుంది. ఇది చాలా సింపుల్ లాజిక్ అని అన్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ తేదీ గురించి కూడా ఓ ఈవెంట్ లో ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ న‌టించిన పెద్ద సినిమా విడుద‌ల కానుంది.

ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ రావాలి. ఆ సినిమా మంచి విజ‌యం సాధించాలి. ఆ త‌ర్వాత రాజాసాబ్ అప్ డేట్స్ వ‌స్తాయి. అంద‌రూ కోరుకునే మంచి తేది చూసుకుని రిలీజ్ చేస్తాం' అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అయితే మారుతి రిలీజ్ తేది దాచ‌డంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌ని అంటున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి వ‌ర‌కూ రాజాసాబ్ రిలీజ్ అయ్యే అవ‌కాశం లేదంటున్నారు. మ‌రి ఆ సంగతేంటో మారుతి తేల్చాలి.