Begin typing your search above and press return to search.

బన్నీ రిఫరెన్స్.. రావు రమేష్ కొడుకు ప్రేమ పాట!!

సీనియర్ నటి ఇంద్రజ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా వేసవి ఎంటర్టైనర్ గా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది

By:  Tupaki Desk   |   17 April 2024 4:26 AM GMT
బన్నీ రిఫరెన్స్.. రావు రమేష్ కొడుకు ప్రేమ పాట!!
X

రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులకు సుపరిచితమైన రావు రమేష్ ఇప్పుడు హీరోగా మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అ ఆ, కేజీఎఫ్.. అలా అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో తనదైన యాక్టింగ్ తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు రావు రమేష్. ఇప్పుడు తన వయసుకు తగ్గ కథ, క్యారెక్టర్ సెట్ అవ్వడంతో హీరోగా మారి సినిమా చేస్తున్నారు.

సీనియర్ నటి ఇంద్రజ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా వేసవి ఎంటర్టైనర్ గా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రమోషన్లు ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, నేనే సుబ్రమణ్యం సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జోష్ లో మేకర్స్ శ్రీరామనవమి స్పెషల్ గా నేడు సెకండ్ సింగిల్ మేడమ్ సార్ ను రిలీజ్ చేశారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారిన ఈ పాట.. మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఎనర్జిటిక్ గా, రొమాంటిక్ గా సాంగ్ బాగుందని నెటిజన్లు చెబుతున్నారు. సిద్ శ్రీరామ్.. ఎప్పటిలానే పాటకు ప్రాణం పోశారని కామెంట్లు పెడుతున్నారు. భాస్కర్ భట్ల లిరిక్స్, కళ్యాణ్ నాయక్ మ్యూజిక్.. రెండూ క్లీన్ గా ఉన్నాయని అంటున్నారు. విజువల్స్ తో పాటు ఓవరాల్ గా సాంగ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుందని చెబుతున్నారు.

అయితే లిరికిల్ వీడియాలో అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా కనిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే పండినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకే అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను అంకిత్ పాడుకున్నట్లు అర్ధమవుతోంది. మూవీలో రమ్య పసుపులేటి గ్లామర్ షో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

పాట విడుదల సందర్భంగా మారుతీ నగర్ సుబ్రమణ్యం దర్శక నిర్మాతలు మాట్లాడారు. ''రావు రమేష్ గారి లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ నేనే సుబ్రమణ్యం మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. ఆయన పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.

ఇక లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న మారుతీ నగర్ సుబ్రమణ్యం చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే క్రియేషన్స్ బ్యానర్లపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ భీమంగని ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపడుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.