Begin typing your search above and press return to search.

మారుతి మ్యాజిక్ తో ప్రభాస్ రాజా సాబ్..!

సినిమా హార్రర్ థ్రిల్లర్ అప్పీల్ తో వస్తుండగా అందుకు తగిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 1:30 PM GMT
మారుతి మ్యాజిక్ తో ప్రభాస్ రాజా సాబ్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో కల్కి పై అంచనాలు తారాస్థాయిలో ఉండగా ఆ తర్వాత వస్తున్న రాజా సాబ్ మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ డబుల్ అవుతున్నాయి. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా ముందు ఫైర్ అయినా చిన్నగా ఆ ప్రాజెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ముఖ్యంగా లుంగితో వింటేజ్ ప్రభాస్ లుక్ ని చూసి వారెవా అనేశారు రెబల్ ఫ్యాన్స్. మారుతి మ్యాజిక్ తో ప్రభాస్ రాజా సాబ్ వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ కథాంశంతో వస్తుందని తెలిసిందే. అయితే సినిమాలో ప్రభాస్ మేకోవర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందట. అంతేకాదు క్యారెక్టరైజేషన్ డైలాగ్స్ అదిరిపోతాయని టాక్. ఈమధ్య వచ్చిన సినిమాల్లో ప్రభాస్ లో కామెడీ యాంగిల్ మిస్ అయ్యింది. అఫ్కోర్స్ అలాంటి కథలు పడ్డాయి. సో ప్రభాస్ లో ఉన్న ఆ కామెడీ యాంగిల్ ని మారుతి మరోసారి వాడుకున్నాడట. రాజా సాబ్ లో క్యారెక్టరైజేషన్ డైలాగ్స్ రెబల్ ఫ్యాన్స్ ని బీభత్సంగా అలరిస్తాయని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో మరో హైలెట్ అయ్యే అంశం విజువల్ ఎఫెక్ట్స్. గ్రాఫిక్స్ తో ఈ సినిమాను మ్యాజిక్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా హార్రర్ థ్రిల్లర్ అప్పీల్ తో వస్తుండగా అందుకు తగిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ లో ట్విస్టులు అదిరిపోతాయట. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కూడా వీర లెవెల్ లో ఉంటాయని తెలుస్తుంది.రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రభాస్ రాజా సాబ్ తో మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రమోషన్ అందుకోవాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చేలా రాజా సాబ్ ఉందంటే మాత్రం మారుతి రేంజ్ కచ్చితంగా పెరిగినట్టే అవుతుంది. రాజా సాబ్ ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయాలని మేకర్స్ ప్లాన్. ఐతే సంక్రాంతి కన్నా ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ చేస్తే బెటర్ అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. 2025 సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ లాక్ చేయగా నాగార్జున కూడా మరో సినిమాతో వస్తాడని టాక్. 2025 పొంగల్ ఫైట్ కూడా ఆసక్తి కలిగించేలా ఉందని తెలుస్తుంది.