Begin typing your search above and press return to search.

డైరెక్టర్ మారుతి.. మరో బేబీ!

దర్శకుడు మారుతి.. ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు

By:  Tupaki Desk   |   19 April 2024 10:03 AM GMT
డైరెక్టర్ మారుతి.. మరో బేబీ!
X

దర్శకుడు మారుతి.. ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో కెరీర్ మొదలు పెట్టి స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. చిన్న, మంచి సినిమాలను ప్రోత్సహిస్తూ నిర్మాతగా, ప్రజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని మారుతి విజువల్‌ ఫీస్ట్‌ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారట.

హారర్‌ జానర్ టచ్ కూడా ఈ సినిమాకు మారుతి యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఊర మాస్ గా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రాజ్ సాబ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవల హీరో ప్రభాస్ రాజా సాబ్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టినట్టు వీడియో వైరల్ అయింది.

ఓవైపు రాజా సాబ్ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. మరోవైపు కొత్త సినిమాను నిర్మిస్తున్నారు మారుతి. ఈ నెల 22వ తేదీన ఆ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆర్‌ వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ చిత్రాన్ని మారుతి.. జీ స్టూడియోస్‌ తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బ్యూటీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే విధంగా ఈ మూవీ ఉండనున్నట్లు సమాచారం.

గతేడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ చిత్రం ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి.. మేకర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బ్యూటీ మూవీ కూడా బేబీ జోనర్ లో తెరకెక్కనుందని సమాచారం. బేబీ మూవీకి మారుతి కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బ్యూటీ ప్రాజెక్ట్ లో కూడా ఆయన భాగమవ్వడం విశేషం.

అయితే బ్యూటీ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి మూడు పాటల రికార్డింగ్ కంప్లీట్ అయిందట. బేబీ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గేనిన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమాలో క్యాస్టింగ్ అంతా కొత్తవారిని తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఏప్రిల్ 22వ తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా బేబీలా హిట్ అవుతుందో లేదో చూడాలి.