హిట్ డైరెక్టర్లతో మారుతి కథలు
తమ కథలను డెవలప్ చేయించి వేరే డైరెక్టర్లకు ఇచ్చి వాటిని సినిమాలుగా తీస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు దీన్ని అమలు చేస్తుండగా, డైరెక్టర్ మారుతి కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు.
By: Tupaki Desk | 17 Jun 2025 12:38 PM ISTతెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తమ సినిమాలను భారీగా తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే ఒక్కో సినిమాకు చాలా ఎక్కువ టైమ్ పడుతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్లు తమ దగ్గర ఎక్కువ కథలు ఉన్నప్పటికీ వరుస పెట్టి వాటన్నింటినీ సినిమాలుగా మరల్చలేకపోతున్నారు. దీంతో డైరెక్టర్లు ఈ విషయంలో కొత్తగా ఆలోచిస్తున్నారు.
తమ కథలను డెవలప్ చేయించి వేరే డైరెక్టర్లకు ఇచ్చి వాటిని సినిమాలుగా తీస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు దీన్ని అమలు చేస్తుండగా, డైరెక్టర్ మారుతి కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. స్వతహాగా మారుతి మంచి రైటర్. ఎలాంటి స్క్రిప్టును అయినా సరే చాలా వేగంగా ఫినిష్ చేయగలడు. ప్రస్తుతం మారుతి దగ్గర చాలా కథలు ఉన్నాయి.
తన కథలను తెరపై చూసుకోవాలనే ఆలోచనతో ఆ కథలన్నింటినీ బయటి డైరెక్టర్ల చేతుల్లో పెడుతున్నాడు మారుతి. ఆల్రెడీ మారుతి కథలతో గతంలోనే కొన్ని సినిమాలు తెరకెక్కగా ఇప్పుడు మరికొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లబోతున్నాయి. మారుతి రాసిన ఆరు కథలను ఆరుగురు డైరెక్టర్ల చేతుల్లో పెట్టగా, వారంతా ఇప్పుడు ఆ కథలకు స్క్రిప్ట్ ను తయారుచేయడంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ కథలు రెడీ అయ్యాక కథకు సరిపోయే హీరోలను వెతకనున్నారు. స్క్రిప్ట్, క్యాస్టింగ్ సెలక్షన్ అయ్యాక సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఈ సినిమాలన్నింటికీ మారుతి రైటర్ గానే ఉంటాడు తప్పించి డైరెక్టర్ గా కాదు. వేర్వేరు నిర్మాతలు ఈ ఆరు సినిమాలను నిర్మించనుండగా రీసెంట్ గా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్లు ఈ సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం రాజా సాబ్ వర్క్స్ లో బిజీగా ఉన్న మారుతి, ఈ సినిమా తర్వాత ఎవరితో మూవీ చేయాలనేది ఇప్పటికే డిసైడయ్యాడని తెలుస్తోంది. మారుతి తన నెక్ట్స్ మూవీని మెగా హీరోతో చేయాలని చూస్తున్నాడట. కథ పూర్తవకపోతే రాజాసాబ్2 కూడా ఉంటుందని చెప్పిన మారుతి, ఒకవేళ ఉన్నా అది వెంటనే ఉండదు కాబట్టి మధ్యలో మారుతి మరో సినిమా చేశాకే పార్ట్2 చేయాల్సి ఉంటుంది.
