మారుతి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి..?
ఈ రోజుల్లో లాంటి సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన మారుతి మొదట్లో కాస్త అడల్ట్ జోకులతో సినిమాలు చేసినా ఆ తర్వాత తన పంథా మార్చుకున్నాడు.
By: Tupaki Desk | 20 May 2025 6:00 AM ISTఈ రోజుల్లో లాంటి సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన మారుతి మొదట్లో కాస్త అడల్ట్ జోకులతో సినిమాలు చేసినా ఆ తర్వాత తన పంథా మార్చుకున్నాడు. తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మారుతి సడెన్ గా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా ఛాన్స్ అందుకున్నాడు. రాజా సాబ్ అంటూ వీరి కాంబో సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఐతే అంతకుముందు పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేసిన అనుభవం లేకపోవడం వల్ల మారుతి రాజా సాబ్ విషయంలో కాస్త టెన్షన్ గా ఉన్నట్టు అర్ధమవుతుంది.
ఎక్కడ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేం అన్న భయం ఉన్నట్టు ఉంది. అందుకే రాజా సాబ్ ని ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. సినిమా ఏం చేస్తున్నా రాజా సాబ్ అప్డేట్స్ ని ఇవ్వకుండా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. సినిమా అప్డేట్స్ ఇవ్వడంలో కూడా జాప్యం ఎందుకనో తెలియట్లేదు. రాజా సాబ్ సినిమాతో మారుతి డైరెక్టర్ గా తన రేంజ్ పెంచుకోవడం పక్కా అనుకున్నారు కానీ సినిమా వచ్చే దాకా రెబల్ ఫ్యాన్స్ కి అతను టార్గెట్ అవుతున్నాడు.
ఐతే రాజా సాబ్ సినిమా తర్వాత మారుతి ప్లాన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రభాస్ తో సినిమా అది పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న బొమ్మ కాబట్టి తప్పకుండా రేంజ్ మారిపోతుంది. ఐతే రాజా సాబ్ విషయంలో మారుతి ఎక్కడో తన రెగ్యులర్ కంఫర్ట్ జోన్ ని దాటి వెళ్లాడని అనిపిస్తుంది. అందుకే సినిమాను ఇంకా ఇంకా చేస్తున్నట్టు అర్ధమవుతుంది.
రాజా సాబ్ తర్వాత మారుతి తప్పకుండా పాన్ ఇండియా సినిమానే చేసే ఛాన్స్ ఉంటుంది. సినిమా లేట్ అవుతుంది అంటే ఇంకా ఇంకా బెటర్ మెంట్ చూస్తున్నాడనే చెప్పొచ్చు. ప్రభాస్ తో సినిమా చేశాక ఏ హీరో అయినా మారుతికి డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక రాజా సాబ్ అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ పడితే మాత్రం మారుతి కి స్టార్స్ పిలిచి అవకాశం ఇచ్చేస్తారని చెప్పొచ్చు. రాజా సాబ్ తో కెరీర్ లో రిస్క్ చేస్తున్నాడు మారుతి మరి అతని ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. అయితే మారుతి మాత్రం రాజా సాబ్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
