మారుతి ప్రూవ్ చేసుకోవాల్సిన టైమ్..!
డైరెక్టర్ గా 10 సినిమాలు చేసిన మారుతి చిన్న సినిమా నుంచి తన కెరీర్ మొదలు పెట్టడం వల్ల అతనికి మంచి కమాండ్ ఏర్పడింది.
By: Tupaki Desk | 6 Jun 2025 8:43 PM ISTడైరెక్టర్ గా 10 సినిమాలు చేసిన మారుతి చిన్న సినిమా నుంచి తన కెరీర్ మొదలు పెట్టడం వల్ల అతనికి మంచి కమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆడియన్స్ పల్స్ పట్టేసిన మారుతి కెరీర్ మొదట్లో కాస్త అడల్ట్ డైలాగ్స్ తో సక్సెస్ అందుకున్నా ఆ తర్వాత తన ట్రాక్ ని కామెడీకి షిఫ్ట్ చేసి వరుస హిట్లు అందుకున్నాడు. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా చేసుకున్నాడు. ఐతే పక్కా కమర్షియల్ తర్వాత మారుతి 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా రాజా సాబ్.
ఇన్నాళ్లు మారుతి డైరెక్షన్ లో చేసిన హీరోలంతా స్టార్సే కానీ రెబల్ స్టార్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోతో చేయడం ఇదే మొదటిసారి. అందుకే రాజా సాబ్ సినిమా విషయంలో మారుతి కాస్త కంగారుగానే కనిపిస్తున్నాడు. మారుతి రాజా సాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్నా అప్డేట్స్ ఇవ్వట్లేదని మారుతిని రెబల్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అయినా కూడా మారుతి ఎక్కడ సినిమా అప్డేట్ ఇవ్వలేదు.
ఫైనల్ గా ఈ డిసెంబర్ కి రాజా సాబ్ ని రిలీజ్ చేస్తున్నారు. మారుతి ఈ సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఇన్నాళ్లు తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలతో అలరించిన మారుతి రాజా సాబ్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తప్పకుండా మారుతి రాజా సాబ్ తో హిట్టు కొట్టాల్సిందే అని రెబల్ ఫ్యాన్స్ అంటున్నారు.
రాజా సాబ్ లో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఫ్యాన్స్ కి ఈ సినిమా సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. ఈ సినిమా హిట్టు పడితే తెలుగు దర్శకుల్లో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న వారిలో మారుతి కూడా చేరతాడు. రాజా సాబ్ తర్వాత మారుతి చేసే సినిమాల మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పొచ్చు. రాజా సాబ్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి మారుతి తన మార్క్ తో నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని అలరిస్తే తప్పకుండా తన కెరీర్ కి కూడా ఈ సినిమా పెద్ద బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.
