Begin typing your search above and press return to search.

చాలా​ గ్యాప్ తర్వాత మార్టిన్​ లూథర్ కింగ్​గా సంపూ

హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్నారు కమెడియన్ హీరో సంపూర్ణేశ్ బాబు

By:  Tupaki Desk   |   19 Sep 2023 7:03 AM GMT
చాలా​ గ్యాప్ తర్వాత మార్టిన్​ లూథర్ కింగ్​గా సంపూ
X

హృద‌య‌కాలేయం, కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకున్నారు కమెడియన్ హీరో సంపూర్ణేశ్ బాబు. స్ఫూఫ్ కామెడీలతో వచ్చిన ఈ చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి స‌క్సెస్​ను అందుకున్నాయి. ఆ సమయంలో వచ్చిన క్రేజ్​తో ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేశారు సంపూర్ణేశ్. కానీ విజ‌యాల్ని మాత్రం అందుకోలేక‌ నిరాశపడ్డారు.


అయితే ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత ఓ పొలిటిక‌ల్ కామెడీ చిత్రంతో సంపూర్ణేశ్​ బాబు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాకు మార్టిన్ లూథ‌ర్ కింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్​. టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో సంపూర్ణేశ్​ బాబు త‌ల‌పై కిరీటం పెట్టుకుని ఉండటం, అందులో కొంత‌మంది నాయ‌కులు ఓట్ల కోసం ప్ర‌చారం చేస్తున్న‌ట్లు కనిపించడం ఇంట్రెస్టింగ్​గా ఉంది. పోస్టర్​ను డిఫ‌రెంట్‌గా డిజైన్ చేశారు.

ఈ చిత్రంలో సంపూర్ణేశ్​ బాబుతో పాటు దర్శకుడు వెంక‌టేష్ మ‌హా, న‌రేశ్ ఇతర కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. సినిమాను అక్టోబ‌ర్ 27న థియేట‌ర్ల‌లో విడుదల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా ఓ కోలీవుడ్ చిత్రానికి రీమేక్ అని స‌మాచారం అందుతోంది.

త‌మిళంలో యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మండేలా సినిమాకు రీమేక్ అని అంటున్నారు. ఈ చిత్రం ఆస్కార్ కోసం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేట‌గిరీలో.. ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. కానీ తుది నామినేష‌న్స్ చోటు ద‌క్కించుకోలేదు. రెండు నేష‌న‌ల్ అవార్డ్స్‌ను ఈ చిత్రం గెలుచుకుంది.

కాగా, పంచాయ‌తీ ఎన్నికల బ్యాక్‌డ్రాప్‌లో మార్టిన్ లూథర్ కింగ్​ రూపొందుతోంది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడో చివరిసాగి 2021లో క్యాలిఫ్లవర్​తో వచ్చిన ఆయన.. ఇప్పుడు రెండేళ్ల తర్వాత రానున్నారు. మరి ఈ చిత్రంతోనైనా ఆయన ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి..