Begin typing your search above and press return to search.

పెళ్లి అయిన హీరోయిన్ల‌కు భ‌లే డిమాండ్

పెళ్లి అయిన హీరోయిన్ల‌కు డిమాండ్ త‌గ్గింది అన్న‌ది ఒక‌ప్ప‌టి మాట‌. నేటి స‌న్నివేశం అందుకు పూర్తి భిన్నం

By:  Tupaki Desk   |   25 Oct 2023 7:05 AM GMT
పెళ్లి అయిన హీరోయిన్ల‌కు భ‌లే డిమాండ్
X

పెళ్లి అయిన హీరోయిన్ల‌కు డిమాండ్ త‌గ్గింది అన్న‌ది ఒక‌ప్ప‌టి మాట‌. నేటి స‌న్నివేశం అందుకు పూర్తి భిన్నం. పెళ్లైతేనే బిజీ అవుతాం! అన్న తీరున తాజా స‌న్నివేశం క‌నిపిస్తుంది. మార్కెట్ లో క్రేజీ భామ‌లుగా దూసుకుపోవాలంటే? పెళ్లి చేసుకోవాలి...ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అవ్వాలి! అప్పుడే మ‌రింత బిజీ అవుతామ‌ని ఈ భామ‌ల్నిచూస్తే తెలుస్తుంది. పెళ్లికి ముందువ‌ర‌కూ ఒక‌లాసాగిన జ‌ర్నీ వివాహం అనంత‌రం రెట్టింపు వేగంతో దూసుకుపోతున్న‌ట్లు క‌నిపిస్తుంది. న‌టీమ‌ణులుగా త‌మ రేంజ్ ని అంత‌కంత‌కు పెంచుకుంటూ ముందుకెళ్లిపోతున్నారు? అన్న‌డానికి కొంత మంది భామ‌ల్ని ఉద‌హ‌రించొచ్చు.

ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడిన త‌ర్వాత దీపికా ప‌దుకొణే సినిమాల వేగం పెంచిన పెంచింది. పెళ్లైన నాలుగేళ్ల‌లో ఏడు సినిమాలు చేసింది. అప్ప‌టివ‌ర‌కూ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లోనే న‌టించిన అమ్మ‌డు సోలోగానూ బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డం మొద‌లు పెట్టింది. 'ప‌ద్మావత్' చిత్రంతో బాక్సాఫీస్ నే షేక్ చేసిన న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం దీపిక 2024 క్యాలెండ‌ర్ కూడా ఫిల్ అయింది. పారితోషికం రెట్టింపు చేసింది. కల్కితో టాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక క‌త్రినాకైఫ్ రెండేళ్ల క్రితం విక్కీ కౌశ‌ల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్ప‌టి నుంచి క్యాట్ సినిమాలు వేగంగా పూర్తిచేయ‌లేదు కానీ..డిమాండ్ మాత్రం పీక్స్ లో ఉంది. ఒక్కో సినిమాకి కోట్ల‌లో ఛార్జ్ చేస్తుంది. ఈ ఛార్జ్ విమ‌ర్శ‌ల‌కు సైతం దారి తీసింది. ప్ర‌స్తుతం 'టైగ‌ర్-3'..'మేరి క్రిస్మ‌స్' సినిమాలు చేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ ల‌కు అడ్వాన్సులు అందుకుంది. వాటిని అధికారికంగా క‌న్ప‌మ్ చేయాల్సి ఉంది. అలాగే ఇదే ఏడాది సిద్దార్ధ్ మ‌ల్హోత్రాని పెళ్లాడి కొత్త జీవితం ప్రారంభించింది కియారా అద్వాణి జ‌ర్నీ కూడా రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తుంది.ఎంతో మంది నాయిక‌లు ఉన్నా శంక‌ర్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ 'గేమ్ ఛేంజ‌ర్' కోసం ఎంపిక చేసాడు. అమ్మ‌డి లైన‌ప్ లో ఇంకా చాలా సినిమాలున్నాయి.

అలాగే ర‌ణ‌బీర్ క‌పూర్ తో వివాహం త‌ర్వాత అలియాభ‌ట్ ఏ రేంజ్ కి వెళ్తుందో క‌ళ్ల‌ముందు క‌నిపిస్తూనే ఉంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతుంది. జాతీయ అవార్డుల సైతం కైవ‌సం చేసుకుంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' సినిమాతో హాలీవుడ్ లోనూ లాంచ్ అవుతుంది. 'గంగూబాయి క‌తియావాడి' తో సోలో నాయిక‌గానూ స‌త్తా చాటింది. క్రైస‌స్ లో రిలీజ్ అయినా ఆ సినిమా బాలీవుడ్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. అదే సినిమాకి ఉత్త‌న జాతీయ న‌టి అవార్డు అందుకుంది. అలియా ఎస్ చెప్పాలేగానీ టాలీవుడ్ మేక‌ర్స్ క్యూలో ఉంటారు.

వీళ్లంద‌రి కంటే సీనియ‌ర్లు అయినా క‌రీనాక‌పూర్...ప్రియాంక చోప్రా...రాణీ ముఖ‌ర్జీ లాంటి వారు మెరుపు వేగంతో కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్నారు. క‌రీనా...రాణీ ముఖ‌ర్జీ లు సోలో భామ‌లుగా ఫోక‌స్ చేస్తున్నారు. మార్కెట్ లో త‌మ‌కంటూ ఓబ్రాండ్ ఐడెంటిటీ ఉండే కాన్సెప్ట్ ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. ఇక ప్రియాంక చోప్రా గ్లోబ‌ల్ స్థాయిలోనే వెలిగిపోతున్న వైనం క‌నిపిస్తూనే ఉంది. నిక్ జోనాస్ తో వివాహం త‌ర్వాత అమెరికాలో కాపురం పెట్టి ఇండియాని షేక్ చేస్తుంది. అవ‌కాశాలు ఇస్తామ‌న్న బాలీవుడ్ లో సినిమాలు చేయ‌ని రేంజ్ కి వెళ్లిపోయింది.

అలాగే సౌత్ నుంచి న‌య‌న‌తార పెళ్లైన బ్యూటీల్లో అగ్ర ప‌ధాన క‌నిపిస్తుంది. ఇటీవ‌లే 'జ‌వాన్' తో భారీ హిట్ అందుకుంది. పెళ్లి అయిన త‌ర్వాత అందుకున్న తొలి స‌క్సెస్ ఇది. దీంతో బాలీవుడ్ లోనూ అమ్మ‌డు చ‌క్రం తిప్ప‌డం ఖాయమ‌ని తేలిపోయింది. ఉత్తరాది హీరోయిన్ల‌కు అక్క‌డ గ‌ట్టిపోటీ ఇస్తుంద‌ని అంచ‌నాలున్నాయి. టాలీవుడ్..కోలీవుడ్ లో ఇప్ప‌టికే తాను సాధించాల్సిందంతా పూర్త‌యింది. ఈనేప‌థ్యంలో ట్రిగ‌ర్ బాలీవుడ్ పై గురి పెట్టింది.

ఇక స‌మంత చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత న‌టిగా ఎంత బిజీ అయిందో తెలిసిందే. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌తోనూ అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. 'య‌శోద‌'..'యూట‌ర్న్' లాంటి సినిమాలు త‌న‌కో సోలో ఐడెంటిటీని తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం చెన్నై స్టోరీస్ లో న‌టిస్తోంది. అలాగే ఐటం పాట‌ల్లోనూ త‌గ్గేదేలే అంటూ స‌త్తా చాటుతుంది. 'ఊ అంటావా 'పాట‌తో పాన్ ఇండియానే షేక్ చేసింది. ఇదంతా పెళ్లి త‌ర్వాత సామ్ లో వ‌చ్చిన కెరీర్ మార్పు. అలాగే చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ బిడ్డ‌కు త‌ల్లైనా అమ్మ‌డి వేగం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌లే 'భ‌గ‌వంత్ కేస‌రి'తో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది. 'స‌త్య‌భామ' లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తుంది. సీనియ‌ర్ హీరోల‌కు పర్పెక్ట్ ఛాయిస్ గానూ క‌నిపిస్తుంది. కెరీర్ ముగిసిపోయింది అన్న విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశాలందుకుని ధీటైన బ‌ధులిస్తుంది.