పెళ్లైన తర్వాత ఖాళీ అయిన భామలు !
పెళ్లికాని భామలకంటే పెళ్లైన భామలే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిజీగా ఉంటున్నారని తేలింది. డబుల్ పారితోషికం చెల్లించి మరీ ఆయాభామల్ని ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 23 Jun 2025 11:10 AM ISTపెళ్లికాని భామలకంటే పెళ్లైన భామలే ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిజీగా ఉంటున్నారని తేలింది. డబుల్ పారితోషికం చెల్లించి మరీ ఆయాభామల్ని ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అలియాభట్, దీపికా పదుకొణే, కరీనా కపూర్ లాంటి భామల పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. అయితే కియారా అద్వాణీ, కీర్తి సురేస్, అదితి రావు హైదరీ లాంటి పెళ్లైన భామలకు మాత్రం సెకెండ్ ఇన్నింగ్స్ లో అంతగా బిజీగా కనిపించలేదు అన్న అంశం చర్చకొస్తుంది.
ప్రస్తుతం ఈ భామలు చేస్తోన్న సినిమాలన్నీ పెళ్లికి ముందు కమిట్ అయిన చిత్రాలు తప్ప పెళ్లికి ముందు ఒప్పందం చేసుకున్న చిత్రాలు కాదని వినిపిస్తుంది. కియారా అద్వాణీ 'వార్-2', 'టాక్సిక్' లో నటిస్తోంది. ఈ రెండు కూడా పెళ్లి కుదిరిన తర్వాత సెట్ అయిన ప్రాజెక్ట్ లు తప్ప అమ్మడి చేతిలో కొత్త సినిమాలేవి కని పించలేదు. ఈ రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇవి రిలీజ్ అయి హిట్ అయితే గానీ కియారా మళ్లీ బిజీ అయ్యేలా కనిపించలేదు.
అలాగే కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ లోనే వివాహం చేసుకుంది. ప్రస్తుతం నటిస్తోన్న 'రివాల్వర్ రీటా', 'కన్నైవెడి' చిత్రాలు వివాహానికి ముందే కమిట్ అయిన చిత్రాలు. 'ఉప్పుకప్పు రంబు' అనే మరో సినిమా చేసింది. కానీ అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఇది కూడా పెళ్లికి ముందే కమిట్ అయిన చిత్రం. ఇక అదితి రావు హైదరీ సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. సిద్దార్ధ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వివాహానికి ముందు బాలీవుడ్ సహా ఇతర భాషా చిత్రాలతో కాస్త బిజీగా కనిపించేది. కానీ పెళ్లైన తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. 'పరివారక్ మనురంజన్', 'లయెన్స్' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు కూడా పెళ్లికి ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్ లే. వివాహం తర్వాత కొత్తగా సైన్ చేసిన చిత్రాలంటూ ఏవీ లేవు. ఇలా ముగ్గురు భామల విషయంలో అవకాశాల పరంగా మ్యారేజ్ కలిసి రాలేదనే చర్చ జరుగుతోంది.
