Begin typing your search above and press return to search.

విశాల్ ని డామినేట్ చేసిన SJ సూర్య

ఇది ఆడియన్స్ కి కొత్తరకంగా అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో విశాల్, సూర్య పోటాపోటీగా నటించారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 5:08 AM GMT
విశాల్ ని డామినేట్ చేసిన SJ సూర్య
X

విశాల్ హీరోగా ఆధిక్రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా మార్క్ ఆంటోనీ. డీసెంట్ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకొని తమిళ్ లో కలెక్షన్స్ బాగానే అందుకుంటోంది. ఈ సినిమాలో విశాల్ డ్యూయల్ రోల్ చేశాడు. అలాగే ప్రతినాయకుడిగా కనిపించిన ఎస్ జె సూర్య కూడా రెండు భిన్నమైన పాత్రలలో కనిపించాడు. ఈ సినిమాలో వీరి పాత్రలే కీలకంగా ఉంటాయి.

మాఫియా కథకి సైన్స్ ఫిక్షన్ పాయింట్ అయిన టైం ట్రావెల్ ఎలిమెంట్ జోడించి కామెడీ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఇది ఆడియన్స్ కి కొత్తరకంగా అనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలో విశాల్, సూర్య పోటాపోటీగా నటించారు. అయితే విలన్ పాత్రలలో సూర్య మాత్రం భిన్నమైన వేరియేషన్స్ చూపిస్తూ ఎక్కువ మార్కులు కొట్టేశాడు.

సూర్యలో మంచి నటుడు ఉన్నాడని అతను దర్శకత్వంలో వచ్చిన వ్యాపారి సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీలో సైకో పాత్రలో సూర్య ఎక్స్ ప్రెషన్స్, పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. మూవీ హిట్ కాకున్న సూర్య పెర్ఫార్మెన్స్ కిచాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అప్పటి నుంచి తమిళంలో విలన్ పాత్రలకి ఎస్ జె సూర్య కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.

స్టార్ దర్శకులు అందరూ తమ సినిమాలలో ప్రతినాయక పాత్రలకి సూర్యనే ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. ఈ జర్నీలో అతని రెమ్యునరేషన్ కూడా 4 నుంచి 5 కోట్లకి పెరిగిపోయింది. ఇక మార్క్ అంటోనీ సినిమాలో ఓ వైపు మాఫియా డాన్ గా క్రూరమైన పాత్రలో నటించి అందులో కూడా ఫన్ యాంగిల్ లో చూపించాడు. రెండింటి మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు.

మార్క్ అంటోనీ సినిమా చూసే వారికి విశాల్ పెర్ఫార్మెన్స్ కంటే తండ్రి, కొడుకులుగా సూర్య చేసిన క్యారెక్టర్స్ బలంగా గుర్తుండిపోతాయి. అంతలా అతను ప్రేక్షకులని మెస్మరైజ్ చేశాడు. పాత్ర బలంగా పండటం కోసం తెలుగులో అతని పాత్రలకి సూర్యనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అతని వాయిస్ లో విలక్షణత కూడా ప్రేక్షకులకి భాగా కనెక్ట్ కావడంతో మార్క్ అంటోనీ తెలుగు, తమిళ భాషలలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.