Begin typing your search above and press return to search.

విజయ్ ఆంటోని మార్గన్ టాక్ ఏంటి..?

హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతగా మెప్పించలేదు. అంతేకాదు హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 12:50 AM IST
విజయ్ ఆంటోని మార్గన్ టాక్ ఏంటి..?
X

బిచ్చగాడు సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన విజయ్ ఆంటోని ఆ సినిమా నుంచి తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఇదే క్రమంలో లేటేస్ట్ గా మార్గన్ అనే సినిమాతో విజయ్ ఆంటోని వచ్చాడు. లియో జాన్ పాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ ఆంటోని, అజయ్ దిశాన్, ప్రీతిక, బ్రిగడ సాగా, సముద్రఖని, మహానంది శంకర్ తదితరులు నటించారు. తమిళంతో పాటుగా తెలుగులో ఒకేసారి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుందో చూద్దాం.

ఇంతకీ మార్గన్ కథ ఏంటంటే.. హైదరాబాద్ లో రమ్య అనే ఒక మహిళ హత్యకు గురవుతుంది. శరీతమంతా కాలిపోయినట్టుగా ఉన్న ఆమె మృతదేహాన్ని చెత్తకుప్పలో కనిపెడతారు పోలీసులు. ఈ కేసు డీల్ చేయడానికి ముంబై అడిషనల్ డీజీపీ ధృవ కుమార్ (విజయ్ ఆంటోని) రంగంలోకి దిగుతాడు. గతంలో తన కూతురు కూడా ఇదే విధంగా హత్యకు గురవడంతో రమ్య కేసును పర్సనల్ గా తీసుకుంటాడు. ఈ కేసు కోసం అన్ అఫీషియల్ గా రంగంలోకి దిగిన ధృవ కుమార్ కొన్ని క్లూస్ తో అరవింద్ (అజయ్ దిశాన్)ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తాడు. ఐతే అరవింద్ కు ఆ హత్యలతో ఉన్న సంబంధం ఏంటి.. నగరంలో జరుగుతున్న హత్యలకు అరవింద్ కు ఏమైనా కనెక్షన్ ఉందా..? ధృవ కూతురిని ఎవరు హత్య చేశారు..? ఈ కేసును డీల్ చేస్తున్న టైం లో ధృవ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అన్నది మార్గన్ కథ.

సాధారణంగా క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాలన్నీ ఒకే టైపు కథలా అనిపిస్తాయి. హత్య జరగడం వాటి వెనుక ఉన్న వ్యక్తులను పోలీసులు విచారణ చేయడం. అలా ఫైనల్ గా నేరస్తుడు ఎవరన్నది కనిపెట్టి వారిని పట్టుకోవడం. మార్గన్ కూడా మొదలవడం అలాంటి కథే అనిపిస్తుంది. ఎప్పుడైతే ధృవ్ అరవింద్ ని విచారించడం మొదలు పెడతాడో అప్పుడు కథలో కాస్త డైవర్షన్ దొరుకుతుంది.

ఐతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. కథలోకి వెళ్లడం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం అరవింద్ గతంలోకి వెళ్లి తన క్యారెక్టర్ ని చూపించడం ఇదంతా బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఇంటర్వెల్ కూడా ఆకట్టుకుంటుంది. ఐతే సెకండ్ హాఫ్ కూడా ఇదే విధంగా ఉంటుందని అనుకోగా అది కాస్త గాడి తప్పింది.

హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతగా మెప్పించలేదు. అంతేకాదు హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. డీజీపీగా ధృవ్ ఎక్కువగా అరవింద్ ని నమ్మి కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా అంతగా మెప్పించలేదు. అరవింద్ క్యారెక్టర్ బాగా రాసుకున్నప్పటికీ సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసుకున్నాడని అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.

విజయ్ ఆంటోని ఇలాంటి సినిమాలకు బాగా సరిపోతాడు. ఎంచుకున్న పాత్రలో బాగా చేశాడు. కానీ అతని క్యారెక్టర్ లో ఇంకాస్త ఇంటెన్స్ ఉంటే బాగుండేది. అజయ్ దిశాన్ కథకు కొత్తదనం తీసుకు రాగా అతను బాగానే చేశాడు. మిగతా పాత్రలంతా బాగానే చేశారు. ఐతే క్రైం థ్రిల్లర్ సినిమాలు టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చునే ఉత్కంఠ ఉండేలా చేయాలి. విజయ్ ఆంటోని మార్గన్ సినిమా విషయంలో ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ టాక్ తప్పేసింది. ఇక థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ మార్గన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.