మర్దానీ 3 టార్గెట్ ఫిక్స్.. ఈసారి మరింత పవర్ఫుల్!
ఇండియన్ సినిమా లో ఇప్పటివరకు వచ్చిన సోలో లేడీ పోలీస్ ఫ్రాంచైజీల్లో మర్దానీ సిరీస్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
By: Tupaki Desk | 21 April 2025 4:02 PM ISTఇండియన్ సినిమా లో ఇప్పటివరకు వచ్చిన సోలో లేడీ పోలీస్ ఫ్రాంచైజీల్లో మర్దానీ సిరీస్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సిరీస్ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ నటి రాణీ ముఖర్జీ పోషించిన శివాని శివాజీ రాయ్ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె మరోసారి అదే పాత్రలో తిరిగి వస్తున్నందుకు మంచి క్రేజ్ కనిపిస్తోంది.
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మర్దానీ 3 సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ తేదీకి సమీపంలో హోళీ పండగ ఉండడం విశేషం. హోళీ అనేది మంచిని ప్రోత్సహిస్తూ చెడును తుడిచిపెట్టే పండగగా భావిస్తారు. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే, మర్దానీ 3లో కూడా మంచి vs చెడు అనే కాన్సెప్ట్ స్పష్టంగా ఉండబోతోంది.
ఈ సిరీస్‌లో శివాని పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, యాక్షన్ ఎలిమెంట్స్ తో కనిపిస్తుందట. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో రాణీ ముఖర్జీ గన్ తో యాక్షన్ మూడ్‌లో కనిపించడంతో అభిమానులలో బజ్ మరింత పెరిగింది. ఇక మూవీ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని మేకర్స్ తెలిపారు. శత్రువులపై యుద్ధం చేసే శివాని పాత్రలో ఆమె మరింత బలంగా కనిపించబోతోందని స్పష్టం అవుతోంది.
మర్దానీ మొదటి రెండు భాగాలు మంచి విజయం సాధించాయి. ఒకవైపు క్రిటికల్ గా ప్రశంసలు పొందిన ఈ సిరీస్.. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు మూడో భాగంపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి కథ మరింత పవర్ఫుల్ గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. రాణీ పాత్ర ఈసారి ఎలాంటి కేసుని ఛేదించనుంది? ఆమెను ఎదుర్కొనే నెగటివ్ ఫోర్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. అభిమానులు మాత్రమే కాదు, సినీ విశ్లేషకులు కూడా ఈ మూవీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేడి ఓరియెంటెడ్ సినిమాలు ఇటీవల మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో మర్దానీ 3 కూడా విజయవంతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో రాణీ చేసిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమా హైలైట్‌గా నిలవనుంది.
