'మార్కో' సీక్వెల్ ప్లాన్ బీ అమలు చేస్తున్నారా?
ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ ఆదేని తెరకెక్కించిన మలయాళ చిత్రం `మార్కో` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Jun 2025 12:30 AMఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ ఆదేని తెరకెక్కించిన మలయాళ చిత్రం `మార్కో` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్రూరమైన హింస నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. 30 కోట్ల పెట్టు బడితో 100 కోట్ల వసూళ్లను రాబట్టారు. అయితే ఈసినిమాపై మాలీవుడ్ లో రివ్యూలన్నీ నెగిటివ్ గా వచ్చా యి. విపరీతమైన హింసతో కూడిన చిత్రంగా అభివర్ణించాయి. బాలీవుడ్ సహా టాలీవుడ్ లో నే ఇదే తరహాలో రివ్యూలొచ్చాయి.
దీంతో ఈ సినిమా సీక్వెల్ ఆలోచన విరమించుకున్నట్లు ఉన్నిముకుందన్ ప్రకటించాడు. దీంతో మల యాళంలో సీక్వెల్ ఉండదని క్లారిటీ వచ్చింది. ఈ తరహా కంటెంట్ ను అక్కడ ఆడియన్స్ జీర్ణించు కోవడం కష్టమైన పని. అక్కడ ఎక్కువగా సాప్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలదే హవా. కానీ బాలీవుడ్..టాలీవుడ్ అందుకు భిన్నమైన సినిమాలు చేస్తోంది. మాలీవుడ్ తో ఈ రెండు పరిశ్రమలను పోల్చాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యం లో `మార్కో `కి సీక్వెల్ హిందీలో కానీ, తెలుగులో కానీ చేసే ఆలోచన ఉన్నట్లు ఓ కొత్త వార్త తెరపైకి వస్తోంది. తెలుగులో ఆ ఛాన్స్ దిల్ రాజు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హనీఫ్ అదేనికి దిల్ రాజు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. `మార్కో` చూసి మెచ్చిన తర్వాత జరిగిన సన్నివేశం ఇది. ఇంకా ఆసంస్థ నుంచి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ ఒకవేళ ప్రకటిస్తే అది `మార్కో` సీక్వెల్ అవ్వడానికి ఛాన్సెస్ లేక పోలేదు.
ఆ సినిమా రైట్స్ కూడా హనీఫ్ చేతుల్లోనే ఉన్నాయి. దానికి రాజుగారు క్రియేటివిటీ జోడిస్తే తెలుగు నెటివిటీలోకి వచ్చేస్తుంది. హింసలో తీవ్రత తగ్గిస్తే సరిపోతుంది. ఇలాంటి భారీ హింసతో కూడిన సినిమాలు తెలుగు ఆడియన్స్ కి కొత్తేంకాదు. 80-90 కాలంలో కత్తులతో, గొడ్డళ్లతో, వేట కొడవళ్లతో దాడులు చూసి చూసి నలిగిపోయిన ప్రేక్షకులు తెలుగోళ్లు. బాలీవుడ్ కి కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ కాబట్టి? మాలీవుడ్ కాదన్నా? టాలీవుడ్ ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం లేకపోలేదు.