Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మనోజ్‌ మౌనిక కలర్‌ ఫుల్‌ దీపావళి

భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత మంచు మనోజ్ ఆమెతో రెగ్యులర్ గా ఏదో ఒక షో కి హాజరు అవుతూనే ఉన్నాడు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తీసుకన్న ఫోటోను మంచు మనోజ్‌ షేర్‌ చేశాడు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 10:13 AM GMT
పిక్ టాక్ : మనోజ్‌ మౌనిక కలర్‌ ఫుల్‌ దీపావళి
X

మంచు హీరో మనోజ్‌ చాలా కాలంగా సినిమా లు చేయడం లేదు. అయితే ఆయన సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా ఏదో ఒక ఫోటో లేదా ఇష్యూ ను షేర్ చేస్తూ ఉండటం వల్ల వార్తల్లో ఉంటూనే ఉన్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ ఫోటోను షేర్ చేసిన మంచు మనోజ్‌ మరోసారి వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.


భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత మంచు మనోజ్ ఆమెతో రెగ్యులర్ గా ఏదో ఒక షో కి హాజరు అవుతూనే ఉన్నాడు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తీసుకన్న ఫోటోను మంచు మనోజ్‌ షేర్‌ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తన ఫాలోవర్స్ కి మరియు అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అందజేస్తూ సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోను మంచు మనోజ్‌ షేర్‌ చేశాడు. ఇద్దరూ కూడా బ్లాక్ లో భలే ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మేడ్‌ ఫేర్‌ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మౌనిక రెడ్డి చాలా అందంగా హుందాగా కనిపిస్తున్నారని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మంచు వారి అభిమానులతో పాటు, ఇతన నెటిజన్స్ ఈ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తూ మంచు జోడీకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.