Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మానుషి మ‌త్స్య‌క‌న్య అవ‌తారం

ఈ కొత్త లుక్ లో మానుషి మ‌త్స్య‌క‌న్న‌ను త‌ల‌పించింది. జ‌ల‌కాలాట‌లు ముగించి ఒడ్డుకు చేరిన మ‌త్స్యంలా క‌నిపించింది మానుషి. ఈ రూపం నిజంగా స‌మ్మోహ‌నుల్ని చేస్తోంది.

By:  Tupaki Desk   |   22 Nov 2023 2:45 AM GMT
ఫోటో స్టోరి: మానుషి మ‌త్స్య‌క‌న్య అవ‌తారం
X

ఇటీవల లైఫ్‌స్టైల్ ఆసియా దీపావళి వేడుక‌ల్లో మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ డిజైనర్ రితికా మిర్చందానీ రూపొందించిన ఈథెరియల్ జార్జెట్ సిల్వర్-గ్రే సీక్విన్డ్ చీరలో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. స్టైలిష్ సైడ్ స్లిట్ లుక్ తో గుబులు రేపింది. మ‌రో ఫోటోషూట్ లో మనీష్ మల్హోత్రా పింక్ సీక్విన్ చీరలో మానుషి స్టన్నింగ్ లుక్ తో క‌నిపించింది. డీప్‌ నెక్‌లైన్ ఉన్న మ్యాచింగ్ బ్లౌజ్‌తో క‌నిపించింది. సింగిల్-లైన్ అన్‌కట్ డైమండ్ నెక్లెస్, పోల్కీ-స్టడెడ్ బ్రాస్‌లెట్ తో అందంగా క‌నిపించింది.


ఇప్పుడు ఆ రెండు రూపాల‌కు భిన్న‌మైన రూపంతో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ కొత్త లుక్ లో మానుషి మ‌త్స్య‌క‌న్న‌ను త‌ల‌పించింది. జ‌ల‌కాలాట‌లు ముగించి ఒడ్డుకు చేరిన మ‌త్స్యంలా క‌నిపించింది మానుషి. ఈ రూపం నిజంగా స‌మ్మోహ‌నుల్ని చేస్తోంది. సిల్వ‌ర్ క‌ల‌ర్ డిజైన‌ర్ ఫ్రాక్ లో ఈ బ్యూటీ మ‌తులు చెడ‌గొడుతోంది. అభిమానుల నుంచి స్పంద‌నలు అనూహ్యం.


మానుషి చిల్లర్ ప‌రిపూర్ణ అందం.. నేప‌థ్యంలో ఐశ్వర్యంతో తుల‌తూగే రాజభవనం అంటూ దీనిపై అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. లక్షలాది మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు... కానీ మీ అందం భిన్నంగా ఉంటుంది. మంత్రముగ్ధులను చేస్తుంది.. అంటూ ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసారు ఒక అభిమాని.


మానుషి చిల్లర్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' చిత్రంలో అక్షయ్ కుమార్ స‌ర‌స‌న‌ తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. మాజీ మిస్సు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక‌పోయాడు. కేవ‌లం త‌న డెబ్యూ సినిమా రిలీజ్ కోసం ఐదేళ్లు వేచి చూసిన ఏకైక దుర‌దృష్ట నాయిక‌గా మానుషి పేరు నిలిచిపోయింది. రెండేళ్ల పాటు క‌రోనా క్రైసిస్ త‌న ఆరంగేట్ర‌ సినిమాకి ఆటంకంగా నిలిచింది. ఆ త‌ర్వాత మ‌రో రెండు చిత్రాల‌కు ఈ బ్యూటీ క‌మిటైనా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. సింహ‌బ‌లుడు జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో న‌టించిన‌ 'టెహ్రాన్' లో మానుషి క‌థానాయిక‌గా న‌టించింది. మానుషి న‌టించిన ది గ్రేట్ ఇండియ‌న్ ఫ్యామిలీ ఓటీటీలో విడుద‌ల‌వుతోంది.


24 ఏళ్ల మానుషి హర్యానాలో జన్మించిన టాప్ మోడల్ కం న‌టి. మిస్ వ‌ర‌ల్డ్ గా కిరీటం అందుకున్నాక‌ పృథ్వీరాజ్- ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలతో పాటు అజయ్ దేవగన్ తో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇటీవ‌ల‌ జాన్ తో సినిమా ప్రారంభ‌మైంది.