Begin typing your search above and press return to search.

మానుషి చిల్లర్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్ షో

నడిరోడ్డుపై ఆ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెలో ఉన్న ఫ్యాషన్ సెన్స్ ఈ ఫోటోలతో మరోసారి అర్థమౌతోంది

By:  Tupaki Desk   |   25 Sep 2023 10:13 AM GMT
మానుషి చిల్లర్.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్ షో
X

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మానుషి అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మొదట మిస్ ఇండియా కాంపిటేషన్స్ లో పాల్గొని విన్ అయిన తర్వాత, మానుషి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముందుగా ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి.


ఇక, మానుషి కి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో మెరుస్తూ ఉంటుంది. ఇక, ఆమె సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ చేసి, ఆ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా ఆమె కొన్ని ఫోటోలు తన ఫ్యాన్స్ తో పంచుకుంది. ఆఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆమె మెరిసింది. అయితే, ఆ డ్రెస్ లో ఆమె తన థైస్ కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నడిరోడ్డుపై ఆ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆమెలో ఉన్న ఫ్యాషన్ సెన్స్ ఈ ఫోటోలతో మరోసారి అర్థమౌతోంది.

ఇదిలా ఉండగా, మానుషి బాలీవుడ్ లో తొలిసారి అక్షయ్ కుమార్ తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించారు. ఆ తర్వాత బడే మియాన్ , చోటే మియాన్, గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి సినిమాల్లో నటించింది. అయితే, ఇప్పటి వరకు ఆమెకు చెప్పుకో దగిన పెద్ద హిట్ అయితే రాలేదనే చెప్పాలి. బాలీవుడ్ లో సక్సెస్ రాకపోవడంతో, ఆమె దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది.

ఆమె త్వరలోనే వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. వరుణ్ తేజ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణంలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, వీఎఫ్ఎక్స్‌ నిపుణుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో వరుణ్ సరసన మానుషి నటించనుంది. వాయుసేనలో ఎదురయ్యే సవాళ్లను చూపించబోయే యాక్షన్ సినిమాలో వరుణ్ తేజ్ ఫైలట్‌గా కనిపిస్తాడు. హీరోయిన్ మానుషి రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించనుందని తెలుస్తోంది.