Begin typing your search above and press return to search.

ప్రపంచ అందగత్తె.. పాపం ఎంత బ్యాడ్ లక్కో..

మిస్ వరల్డ్ గా అందరి మనసులు దోచుకున్న ఈ అమ్మడు.. హీరోయిన్ గా మాత్రం అస్సలు క్లిక్ అవ్వలేదు.

By:  Tupaki Desk   |   14 April 2024 5:47 AM GMT
ప్రపంచ అందగత్తె.. పాపం ఎంత బ్యాడ్ లక్కో..
X

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లో మానుషి మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. భారత్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకున్న ఆరవ బ్యూటీగా నిలిచింది. 17 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం పొందిన భారతదేశ ప్రతినిధిగా రికార్డు క్రియేట్ చేసింది ఈ హరియాణా అమ్మడు.

ఆ తర్వాత సినీ కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని 2022లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీతో వెండితెర పరిచయమైంది. మిస్ వరల్డ్ గా అందరి మనసులు దోచుకున్న ఈ అమ్మడు.. హీరోయిన్ గా మాత్రం అస్సలు క్లిక్ అవ్వలేదు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమానే మానుషి నటించిన తొలి చిత్రం. అది ఉహించని విధంగా డిజాస్టర్ అయింది. డెబ్యూ మూవీతోనే భారీ ఫ్లాప్ అందుకుంది మానుషీ చిల్లర్.

సెకెండ్ మూవీ తోనైనా హిట్ కొడదామని ట్రై చేసినా కుదరలేదు. మానుషి నటించిన ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ భారీ ఫ్లాప్ అయింది. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. వరుణ్ తేజ్ తో కలిసి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేసింది. కానీ ఈ మూవీ కూడా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ డెబ్యూ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.

ఇక మానుషి నటించిన బడే మియాన్ చోటే మియాన్ చిత్రం ఇటీవల రిలీజైంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ మూవీలో కెప్టెన్ మిషాగా మానుషి కనిపించింది. ఈ చిత్రంలో ఆమె స్టైలిష్ గా కనిపించినప్పటికీ యాక్టింగ్ విషయంలో తన మార్క్ చూపించలేకపోయింది. మొత్తానికి ఈ మూవీతో కూడా డిజాస్టరే అందుకుంది. అలా ఇప్పటి వరకు రెండేళ్లలో నాలుగు సినిమాలు చేసినా.. ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది.

ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. మాజీ మిస్ వరల్డ్ కు ఫస్ట్ హిట్ ఇంకెప్పుడు దక్కుతుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చెబుతున్నారు. నెక్స్ట్ మూవీతో గట్టి హిట్ కొట్టాలని సూచిస్తున్నారు. రెండేళ్లలో నాలుగు సినిమాలు డిజాస్టర్లుగా మారినందున.. జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం మానుషికి తెలుగులో కొన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ కొత్త మూవీ ఎలా ఉంటుందో చూడాలి.